
CHANDAMAMANU YENTHAKALAM BANDI CHEYAGALARU
₹230
In stock · 17 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076510
హిందూత్వ రాజ్యంలో ప్రశ్నించడం ఒక నేరం! నియంతృత్వ ధోరణినీ, మూకస్వామ్యాన్నీ, అన్యాయాన్నీ, అసంబద్ధతనీ దేనిని ప్రశ్నించినా అది నేరమే. హక్కుల కోసం పోరాడటం అంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి “కుట్ర” చేయడం! హక్కులు లేని వారి పక్షాన నిలబడటం అంటే "దేశద్రోహం"! ప్రజాస్వామికంగా ఆలోచించడం అంటే "ఉగ్రవాదం"! గత దశాబ్ద కాలంగా ఇటువంటి “నేరాల' కారణంగా బందీ అయిన రాజకీయ ఖైదీల గురించి, వారి కుటుంబ సభ్యులూ, వారికి కావల్సిన వారూ, వారిని ప్రేమించేవారు "రాజ్యం తమ ఇంటికి వచ్చిన వేళలో" తమ జీవితం మొత్తం తల్లకిందులుగా మారిన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు? బందీలుగా ఉన్నవారు జైలు కటకటాల నుండి చందమామను చూస్తూ ఏ ఆలోచనలు చేశారు? ఏం కలలు కన్నారు? అనే విషయాలను ఈ పుస్తకం ఒక మంచి సామాజిక రాజకీయ విశ్లేషణతో నమోదు చేసింది. ఇందులో నమోదు కాకుండా గణాంకాల్లో మిగిలినవాళ్లు కొందరైతే, యే లెక్కల్లోకి రాకుండానే కారాగారాల్లో నిశ్శబ్దంగా చరిత్ర నిర్మిస్తున్నవారు కూడా ఇంకా ఎందరో ఉన్నారని మనకి ఈ పుస్తకం హామీ ఇస్తుంది. స్వేచ్ఛ గురించి కలలు కనడం మాత్రం జైలు గోడలు ఎప్పటికీ ఆపలేవు. ఇంత మంది జైళ్ళల్లో ఉన్నారన్న బాధతో పాటు, సమాజం గురించి ఆలోచిస్తున్న వారు ఇంత మంది ఉన్నారన్న భరోసాని కూడా ఈ పుస్తకం కలిగిస్తుంది. ఊహించని విధంగా జైలుకి వెళ్ళిన వారు సైతం జైళ్ళు అవసరం లేని సమాజాన్ని సాధించుకోవడం కోసం జైలుకు వెళితేనేమి! ప్రాణాలు ఒడ్డితేనేమీ! అనే ధీమాని కనపరచడం బయట సమాజానికి ఒక గొప్ప పోరాట సందేశాన్ని తప్పక ఇస్తుంది.