CHANGHIZ KHAN - TENNETISURI by TENNETI SURI Telugu book cover

CHANGHIZ KHAN - TENNETISURI

by TENNETI SURI

₹350
In stock · 600 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తెన్నేటి సూరి జననం : 1911 మరణం: 1959 "కూడు గుడ్డా నీరు కావాలి అన్నాడు తన మాటెమరచి నీకొరకె వాపోయాడు రచ్చలో నీమాటె తెచ్చి వాదించాడు విచ్చుకలమూని నీ శత్రువుల చీల్చాడు” “నీ కవిని బతికించుకోవాలిరా నీవు మనిషనిపించుకోవాలిరా” అంటూ కవుల పక్షాన, కవుల కోసం తన కలం, గళం అంకితం చేసిన ప్రముఖ రచయిత తెన్నేటి సూరి. ప్రతి రచయితకూ సామాజిక బాధ్యత ఉన్నదని నమ్మిన రచయిత. కుట్రలూ, కుహకాలూ, మోసాలూ, దగాలూ, స్వార్థం కలగలిసి రాజకీయంగా చెలామణీ అవుతున్న దశలో ఎక్కడ ఏమాత్రం మానవత్వం ఛాయలున్నా దాన్ని పసిగట్టి ప్రకాశింప చేయాలన్న దీక్షగల రచయిత సూరి. ఆ జ్వాల ఆరకుండా ఉద్యమస్ఫూర్తి తైలంతో జ్వలింపచేస్తూ దాన్ని తన ముందు తరాల రచయితల కందించిన దీపధారి. అందుకు తన సాహిత్యాన్ని మీదు కట్టిన ఆశాజీవి. అభ్యుదయ రచయితల ఉద్యమనాయకుడు. అమెరికన్ "ఛంఘిజాఖాన్ పరమక్రూరుడైన హంతక నియంత" అన్నది జర్మన్ చరిత్రకారుల పసికరల దృష్టి. "ఛంఘిజ్భాన్ నా ఆదర్శ వీరుడ”న్నది జవహర్ లాల్ ఆరోగ్యవంతమైన చూపు. 12, 13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను వివేచించి సరైన అంచనా వెయ్యగల సాహితీ చరిత్రకారులకు, సామ్రాజ్యవాదాన్నీ, చుట్టుపట్ల ఉన్న దేశాల కుటిల రాజకీయాల నెదిర్చి- మంగోల్ జాతికేకాక ఆసియాఖండానికే ఉజ్జ్వల భవిష్యత్తు అందించిన వెలుగుసూర్యుడూ, మహోన్నత మానవతావాదీ ఛంఘిజ్భాన్. “మన చేతిలోని ఆయుధాన్ని నిర్ణయించేది శత్రువు చేతిలోని ఆయుధమే" అన్న సూక్తే ఛంఘిజ్బాన్ చండశాసనపరత్వానికి కారణభూతం కావచ్చు. తెన్నేటి సూరి, తననాటికున్న వివిధ గ్రంథాల నాధారంగా చేసిన సాధికారిక రచన ఇది. ఎంతో నైపుణ్యంతో చరిత్రను కాల్పనిక కావ్యంగా తీర్చిదిద్దిన సందర్భం ఇది. భారతి, ఆంధ్రపత్రికలలో 1945-1957లలో పత్రికారచయితగా పనిచేశారు. “విప్లవరేఖలు” "సుబ్బలక్ష్మి" కథల సంపుటాలనూ, "అరుణరేఖలు”, “మహోదయం" కవితాసంకలనాలనూ, “నా రాణి” నాటికను ప్రచురించారు. వీరి రచనలలో “సాహిత్య సమవాకారము” చక్కని వ్యంగ్యరచన. "రెండు మహానగరాలు" మంచి స్వేచ్చానువాద నవల. అంతర్జాతీయ కథానికల పోటీలో (1954) వీరి “భారతి” కథకి పురస్కారం వచ్చింది. సునిశిత అంతర్దృష్టిగల ప్రగతిశీల రచయిత తెన్నేటి సూరి.