
CHARITRA SAMSKRUTHI VYASAVALI
₹55
In stock · 317 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆంధ్రుల చరిత్ర రచనలో మలుపులు తిరిగిన వికాస దశలు ఆంధ్రదేశ చరిత్ర రచన, 19వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఆంధ్రుల సాంస్కృతిక పునరుజ్జీవనంతో ప్రారంభమైంది. తెలుగు మేధావులు, భారతీయ మేధో జగత్తులో వచ్చిన సాంస్కృతిక చైతన్యాన్ని పుణికి పుచ్చుకొని, అందులో భాగంగా తెలుగుజాతి గత చరిత్ర, సంస్కృతులపై దృష్టి నిలిపారు. జాతీయ భావ ప్రభావంలో అటు సాహిత్య సంస్కృతులే కాక, ఇటు చరిత్ర రచనపై కూడా ఆసక్తి పెరిగింది. జాతీయవాద చరిత్ర రచన అనే ఒక ఆలోచనా సరళి ప్రారంభమైంది. గత కాలపు కీర్తి వైభవాల్ని సమకాలీన సమాజంలో చరిత్ర ద్వారా ప్రస్తుతించడం వల్ల జాతీయోద్యమ భావజాలానికి మరింత పుష్టి చేకూరుతుందని చరిత్రకారులు విశ్వసించారు. ఆంధ్రదేశంలో మొదలైన చరిత్ర రచన, 19వ శతాబ్దంలో విద్వాంసులు, సాహిత్యకారులైన కల్నల్ మెకంజీ, చార్లెస్ బ్రౌన్, జిల్లా మాన్యుయల్స్, గెజిటీర్లు రచనలను వెలికితీసి చరిత్ర నిర్మాణానికి పూనిక చేశారు. 1900ల సంవత్సరంలో లండన్ నుంచి ప్రచురితమైన రాబర్ట్ సీవెల్ రాసిన 'విస్మృత సామ్రాజ్యం (Forgotten Empire), ఆంధ్రుల గత చరిత్రను మరింతగా తెలుసుకోడానికి దోహదం చేసింది. యూరోపియన్ సాహిత్యం ద్వారా పాశ్చాత్య సంస్కృతిని ఆకళింపు చేసుకొన్న తెలుగు రచయితలు, నూతన సాహిత్య సృష్టిలో భాగంగా తెలుగు కవుల చరిత్రను ఆధునిక దృక్పథంతో రాయనారంభించారు. ఈ వరవడి కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది. పత్రికా రచనలో కూడా కొత్త పుంతలు దీని ప్రభావంతో ఏర్పడ్డాయి. కందుకూరి సాహిత్య కృషికి, గురజాడ, గిడుగులు మరింతగా దోహదం చేసి, వస్తు పరంగా, భాషా పరంగా తెలుగు సాహిత్య సంస్కృతులను ముందుకు తీసుకెళ్ళారు. గురజాడ, స్థానిక చరిత్రల రచనకు కూడా శ్రీకారం చుట్టాడు. 'విజ్ఞాన చంద్రిక' గ్రంథమండలి స్థాపన ద్వారా, కొమర్రాజు లక్ష్మణరావు చరిత్ర, సంస్కృతులపై పరిశోధనా దృక్పథాన్ని జోడించి రచనలు చేయడం ప్రారంభించాడు. కొమర్రాజు ప్రోత్సాహంతో, చిలుకూరి వీరభద్రరావు ప్రాచీన, మధ్యాంధ్రదేశ చరిత్రపై పరిశోధనలు సాగించి, 1910-36 మధ్య కాలంలో, మూడు సంపుటాలను (విజయనగర సామ్రాజ్యం వరకు) వెలువరించాడు. కొమర్రాజు, చిలుకూరిగార్ల చరిత్ర రచనా దృక్పథం 'పాత' పద్ధతిలోనే నడిచింది. ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనం కంటే, తారీఖులతో, దస్తావేజులతో రాజవంశాల చరిత్రతో వీరి రచనా వ్యాసంగం నిండిపోయింది. చరిత్ర రచనలో తొలి దశలో యిది తప్పనిసరి. 1912లో ఏర్పడ్డ ఆంధ్రమహాసభ, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి పూనుకున్నప్పుడు, దాంతో పాటు భాషా, జాతీయత కలగలసి చారిత్రక పరిశోధనకు