CHARLI CHAPLIN - JEEVITHA SANGRAHAM by VASIREDDY BHASKARA RAO Telugu book cover

CHARLI CHAPLIN - JEEVITHA SANGRAHAM

by VASIREDDY BHASKARA RAO

₹80
In stock · 773 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పరిచయం ఇరవైయవ శతాబ్దంలో అత్యున్నత గౌరవం పొందిన కళాకారుల్లో చార్లీ చాప్లిన్ ప్రథముడు. చాప్లిన్ మహానటుడు. హాస్య వినోద చక్రవర్తి. చాప్లిన్ సాధారణ రీతికి భిన్నంగా చిత్రంగా ధరించిన దుస్తులతో వంకర టింకర నడక (Tight Rope Walk) తో, చేతి వంకె కర్రతో, ఆ పాత్ర (Tramp) చేసే చేష్టలు, చిన్న టోపి (Derby Hat) అమాయకంగా మిలమిలలాడే కళ్లు, మాటల ద్వారా కాకుండా, వేషం, మూగ నటన ద్వారానే ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్విస్తాడు. అనేక రకాలుగా అందరినీ గలగల లాడిస్తాడు. నవ్వుతో పాటే, అ నవ్వు నుండే దుఃఖం అలలుగా పొర్లుకొస్తుంది. ఆ వినోదం, ఆ విషాదం రెండూ జీవిత సత్యాలే. అవి జీవితానికి బొమ్మ, బొరుసూ లాంటివి. నవరసాల్లోని హాస్యాన్నీ, కరుణని సమపాళ్లలో రంగరించి వెండితెర మీద ప్రదర్శించి ప్రేక్షకుల కళ్ళ పొరలను తొలగిస్తాడు. జీవిత సత్యాలను ఈ రెండు రసాల విచిత్ర సంయోగం (Tragic Comedy) ద్వారా అద్భుతంగా చిత్రిస్తాడు. ఇదే ప్రత్యేకంగా పేర్కొనదగిన చాప్లిస్ విశిష్టత, ఇటువంటి రస సృష్టిని నూతనంగా ప్రయోగం చేసిన వాళ్ళలో ఆయన మొదటి వాడూ, ఆఖరి వాడుగా చెప్పవచ్చు. చాప్లిన్ ఈ రస సంయోగాన్ని చార్లీ వ్యక్తిగతమైన జీవితానుభవాల నుండే సృష్టించాడు. జీవిత వాస్తవాలను ప్రతిబింబింప చేయటానికై ఒక విచిత్ర వేషదారి (Tramp) ని తన ప్రముఖ పాత్రగా తానే సృష్టించాడు. దాని ద్వారా దాదాపు వందకు పైగా చిత్రాలలో వివిధ రకాలైన పాత్రలను నటించాడు. అది ఆపూర్వమైన పాత్ర. ఆ విచిత్ర పాత్రధారి పైకి దేశదిమ్మరి, తిరుగుబోతు, జోకర్, బఫూన్, హాస్యగాడు, విదూషకుడుగా కన్పడినా, అమితంగా హాస్యాన్ని, పరిహాసాన్నీ, వ్యంగ్యాన్నీ, అపహాస్యాన్నీ, అసహ్యాన్నీ కల్గించినా అపాత్ర అసలు రూపం అది కాదు. వాటిలో అంతర్లీనమైన ఆవేశం వెనుక ఎంతో విషాదాత్మకమైన, కరుణాత్మకమైన స్వరూపంగల మరో పాత్ర వుంది. చాప్లిన్ సినిమాలు చూస్తున్నంతసేపూ ఒక ఊహా భావంతో ప్రేక్షకులు ముగ్ధులవుతారు. అంతా విరగబడి, పగలబడి, హాయిగా ఆనందంగా నవ్వుతారు. సినిమా చూచిన తర్వాత నెమ్మదిగా మరొక వూహా భావం ప్రేక్షకులను నిశ్శబ్ధుల్ని