
CHATHUSHASTI KALALU 64 KALALU
₹300
In stock · 1 available
PublisherKEKALATHURI KRISHNAIAH
LanguageEnglish
ముందుమాట నేను చతుష్షష్టి కళల గురించి వ్రాయదలచుకున్నప్పుడు నా స్నేహితులు కొందరు గొప్ప సాహసమే అన్నారు. ఇది నా 24వ రచన. ఇంతవరకు నేను ఎదగడానికి కారణం దైవానుగ్రహమే తప్ప నా శక్తి సామర్థ్యాలు కావని నా భావన. దైవ ప్రేరణతోనే ఒక విషయం మీద పుస్తకం వ్రాయదలుచుకుంటాను. దానికి సంబంధించి అన్ని విధాల దైవం సహాయపడి పూర్తయ్యేటట్లు చేస్తాడు. డాక్టరు అబ్దుల్ కలాం గారు తన జీవిత చరిత్ర "వింగ్స్ ఆఫ్ ఫైర్"లో ఈ విధంగా వ్రాశారు. "నేనేదైనా కొత్త కార్యక్రమం ఆరంభించినప్పుడు నాకు తెలిసిన వరకు పూర్తి చేస్తాను. తెలియనిది దేవుడి మీద భారం వేస్తాను. వ్యక్తి ద్వారానో, పుస్తకం ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు నాకు తెలియజేస్తాడు". "అప్పుడు నేను ఆ పని పూర్తి చేసేవాణ్ణి అన్నారు". నా జీవితం కూడా అదే అనుభవాలతోనే గడిచింది. కాబట్టి ఈ రచనా వ్యాసాంగం కూడా దైవానుగ్రహమే. నేను 2002లో యూరోప్ లో మూడు నెలలు ఉండే అవకాశం వచ్చింది. అప్పుడు ఒక ఇంగ్లండ్ తప్ప మిగిలిన ప్రాంతాలు చూడడం జరిగింది. అప్పుడు ఫోటోలు తీసుకోవడం, చూసిన దృశ్యాలు ప్రాంతాలను గురించి వివరంగా వ్రాసుకునే వాణ్ణి. ఇక్కడకు వచ్చిన తర్వాత నా శ్రేయోభిలాషులు దాన్ని పుస్తకంగా ప్రచురించమని సలహా ఇచ్చారు. మరియు నేను దుబాయి, నేపాలు, సింగపూర్, మలేషియా, శ్రీలంక పర్యటన వివరాలు కూడా కలిపి "దేశ విదేశీయాత్రా విశేషాలు" అని 2008లో తొలి పుస్తకం ప్రచురించాను. నేను చారిటబుల్ ట్రస్టుకు ఏడు సంవత్సరములు కార్యదర్శిగా పనిచేసినప్పుడు ప్రతి మీటింగ్ లోనూ సత్సంగ ఉపన్యాసాలు ఇచ్చేవాడిని. ఆ ఉపన్యాసాల సారంతో "సత్సంగ సంకలనం" అని రెండో పుస్తకం ప్రచురించాను. నేను 1999లో యోగ విద్యలో ప్రవేశించాను. తర్వాత కొన్ని అనుభవాలతో, కొంత పరిశీలనతో అందరికీ ఉపయోగపడే విధంగా యోగాకు సంబంధించి పుస్తకం వ్రాయదలచి "భారతీయ యోగ సమ్మేళనము" అని వ్రాసి ప్రచురించాను. అనుకున్న విధంగా అందరి మన్ననలు పొందింది.