CHATTAM - KIRANAM (RAYS OF THE LAW) by MEERAVALI SHAIK Telugu book cover

CHATTAM - KIRANAM (RAYS OF THE LAW)

by MEERAVALI SHAIK

₹100
In stock · 1 available
PublisherASIA LAW HOUSE
LanguageTelugu
of the Law విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమా? కన్నతండ్రే కాలయముడైతే? ఆత్మబంధువులే రాబందులుగా మారితే? ప్రాణస్నేహితులే క్షణికానందం కోసం ప్రాణం తీస్తే? విద్యాబుద్ధులు నేర్పవలసిన గురువులే కీచకులుగా మారితే? ఎవరికి చెప్పుకోవాలో, ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న అభాగ్యులకు దిక్సూచే 'చట్టం - కిరణం'. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు తమ పిల్లలు బయటి ప్రపంచంలో ఎలా మసలుకొనుచున్నారో తెలియదు. సోషల్ మీడియా ప్రభావంతో దేశ యువత వక్రమార్గంలో పయనిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుచున్నారు. ఉదా : పాఠశాల / కళాశాల విద్యార్థినులను మూకుమ్మడి మానభంగం చేయుట, ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చుట, కాసులకు కక్కుర్తిపడి దంపతులు స్వీయ పడకగది వీడియోలు అమ్ముకొనుట మొ॥ మచ్చుకు కొన్ని మాత్రమే. సంఘటన జరిగాక వాటి పరిణామాలు ఎలా ఉంటాయో వీరికి తెలియదు. క్షణికానందం కోసం ఘోరాలు చేస్తున్నారు. బంగారు బాల్యం, యువత యొక్క నడతపై దేశాభివృద్ధి ఆధారపడుతుంది. వీరికి చట్టాలపై కనీస అవగాహన కలిగించాలనే ఏకైక లక్ష్యంతో ఈ పుస్తకమును మీ ముందుకు తెచ్చాను. ఇందులో మంచి స్పర్శ - చెడు స్పర్శ (GOOD TOUCH - BAD TOUCH), 2012 (POCSO ACT 2012), 2 (CSEAM) శక్తి యాప్ (SHAKTI APP) మొ||వి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగినది. న్యాయ సేవాసంస్థలు, హోంశాఖ మరియు సమగ్ర శిశు అభివృద్ధి శాఖ వారు తరచుగా విద్యాలయాలు సందర్శించి పై చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇది శ్లాఘనీయం. నా తొలి ప్రయత్నంగా ముద్రించిన ఈ పుస్తకంలో ఏమైనా తప్పులుంటే మిత్రులు మరియు శ్రేయోభిలాషులు సహృదయంతో నాకు తెలియజేసినచో మలి ముద్రణలో సరిదిద్దగలను. ఈ పుస్తకమును సకాలంలో చూడముచ్చటగా ముద్రించి ఇచ్చి, నాకు సహకరించిన విశాలాంధ్ర ప్రెస్, విజయవాడ వారికి ధన్యవాదాలు. Log of మీరావలి షేక్