CHEEKATI THERALU KATHALA SAMPUTI by ANDE NARAYANA SWAMY Telugu book cover

CHEEKATI THERALU KATHALA SAMPUTI

by ANDE NARAYANA SWAMY

₹60
In stock · 315 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆత్మీయత తొలిగా నేనా గ్రామం వరినారు నిమిత్తం వెళ్ళాను. నారు కోసం తిరిగి తిరిగి ప్రాణం బేజారై పోయింది. నారు ఎక్కడా కుదరలేదు. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు! అప్పటికి తిండి తిప్పలూ లేదు! కడుపులో చరచరలాడుతున్నది. పైన నెత్తి కాలుతున్నది. భోజనం పెట్టేటందుకు ఆ వూళ్ళో బంధువులెవరూ లేరు. పోనీ పూటకూళ్ళు తిందామా అంటే అది కుగ్రామం. పెట్టేవాళ్లు లేరు. ఎవరిదో గచ్చరుగుల యిల్లు నీడగావుంటే తిరిగి తిరిగి ఆ అరుగుమీద చతికిలపడ్డాను. యివాళ్ల లేచినవేళ యెటువంటిదో గాని వచ్చినపని కాకపోగా, తిండికి గూడా మాడవలసి వచ్చింది. పోనీ ఎకాయెకి ఇంటికి వెళ్లిపోదామా అంటే అక్కడకు మా గ్రామం ఎనిమిది మైళ్లు వున్నది. ఆవాళ ఎండ చుర్రు మంటున్నది. అందులో తిరిగి తిరిగి వుండటంవల్లనూ, తిండితిప్పలూ లేక పోవడంవల్లనూ కాళ్లు తేలిపోతున్నవి. యెట్లా వెళ్లడం? మా గ్రామానికి బస్సులూ గిస్సులూ యేమీ లేవు. ఆ అరుగు మీద కూర్చుని యెట్లానా? అని ఆలోచిస్తున్నాను. యింతలో ఆ యింటి యజమాని కామాల లావుగా వున్నాడు. భోజనంచేసి తేపుకుంటూ బైటికి వచ్చాడు. అప్పుడు నేను 'ఏమండి! పని వుండి యీ గ్రామం వచ్చాను. భోజనం వేళ దాటి పోయింది. తిరిగి తిరిగి డస్సి వున్నాను. యీ వూర్లో పూటకూళ్లు పెట్టేవాళ్లెవరైనా వున్నారా?' అని అడిగాను. పెట్టేవాళ్లు లేరని తెలిసిగూడా. ఎందుకంటే ఇల్లూ వాకిలీ చూస్తే ధనవంతులు గానే వున్నారు. ఆయన దయదలచి 'యీ వూర్లో పూటకూళ్లు పెట్టేవాళ్లు లేరు, పోనీ పాపం! యీ పూటకు మా యింట్లో భోం చెయ్యమని అంటాడేమో'నన్న ఆశతో అడిగాను. అతడు చప్పరించి "యీ వూల్లో పూటకూళ్లు పెట్టె వాల్లెవరూలేర”ని బదులు చెప్పి లోనికి వెళ్లిపొయ్యాడు. నా ఆశ వృధా అయింది. ఇక ఎవరి నడిగినా లాభం లేదనుకొని కాసేపు యెక్కడైనా పడుకొని చల్లపడ్డాక మా వూరు వెళ్లిపోదామని నిశ్చయించి అక్కడ నుంచి లేచి ఆ గల్లీ దాటి మలుపు తిరిగాను. ఆ వీధి మూడో యిల్లో నాలుగో యిల్లో అయివుంటుంది. పెంకుటి భవంతి. ముందు వసారా. ఇంటిముందు వేపచెట్టు వున్నది. చల్లగా వుండటంవల్ల ఆ వసారాలో కాస్త వెన్ను వాలిద్దామని వెల్లాను. ఎవరో అమ్మాయి, వసారా స్థంభాన్ని ఆనుకొని తాటిపండు చీకుతూ వుంది. నేను వెళ్లి చొక్కా విడిచి కూచున్నాను. ఇంతలో లోపలినుంచి ఒక స్త్రీ చంకన బిడ్డను యెత్తుకుని గుమ్మంలోకి వచ్చి నిలుచుంది. వయసు ముప్పై ఏళ్లుంటవి. చామనఛాయ శరీరం. ఆకుపచ్చ రంగు చీరె