CHETTU - VACHANA SATAKAM by DR.JUTURU SHARIF Telugu book cover

CHETTU - VACHANA SATAKAM

by DR.JUTURU SHARIF

₹60
In stock · 1 available
PublisherDR.JUTURU SHARIF
LanguageTelugu
చెట్టు ( వచన శతకం ) -డా|| జూటూరు షరీఫ్ * సోదరులు డా॥ జూటూరు షరీఫ్ రాసిన 'చెట్టు' అనే వచన శతకం తెలుగు పర్యావరణ కవిత్వ వృక్షంలో తాజా కొమ్మ, చెట్టును నిరాకరిస్తే మానవ జీవితం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. చెట్టు తన శరీరంలో ఏదీ దాచుకోకుండా అంతా మనిషికి దానం చేస్తుందన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలని సూచిస్తుండడం అభినందనీయం. షరీఫ్ వచన శతకం రాయడం ప్రయోగం. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత * చెట్టు గురించి జూటూరు మాటలన్నీ బంగారు మాటలే. ఈ వచన శతకంలో చెట్టు పచ్చగా ఉంటేనే మనమూ పచ్చగా, ఆనందంగా ఉంటామన్న స్పృహను ఈ శతక రచన ద్వారా కవి వ్యక్తపరుస్తున్నారు. షరీఫ్ వచన కవితల్లో వుండే భావ గాఢత, భావ సాంద్రతల్ని ఒడిసి పట్టుకుని ఈ శతకంలో వచన పద్యాలను చెక్కడం చూస్తే అతని కవిత్వ నిర్మాణ నైపుణ్యం మనల్ని ఆశ్చర్యంలోకి లాక్కెళ్ళుతుంది. - తూముచెర్ల రాజారామ్ కవి, విమర్శకులు * మిత్రుడు జూటూరు షరీఫ్ తెస్తున్న 'చెట్టు' వచన శతకం అనంత సాహిత్యంలో విలక్షణ ఒరవడి దిద్దుతుందన్నది నిస్సందేహం. ప్రతివారు తప్పనిసరిగా తమ ఆలోచనల్లో పాదు చేసుకోవాల్సిన వస్తువును అంతే రమణీయంగా అక్షరగానం చేయడం అభినందనీయం. - గుంటి మురళీకృష్ణ భరద్వాజ్ సీనియర్ జర్నలిస్ట్