CHIDAMBARA RAHASYAM - PILLALA KATHALU BOMMALATHO by VALLAMETI SUNDARA RAMAIAH Telugu book cover

CHIDAMBARA RAHASYAM - PILLALA KATHALU BOMMALATHO

by VALLAMETI SUNDARA RAMAIAH

₹30
In stock · 756 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
లౌక్యం రోమన్ చక్రవర్తి నీరో సంగీత ప్రియుడు. రోమ్ నగరం కాలిపోతుంటే అతను ఫిడేలు యిుంచుకొంటూ ఉన్నాడని అతని మీద ఒక అపవాదు కూడా ఉంది. అతను గాయకుడు కూడా! తన గానానికి అందరూ తలలు ఊపాలని, తనను గొప్పగా పొగడాలని ఆశించేవాడు. కానీ ఎవరైనా అతిగా పొగుడుతున్నారని అనిపిస్తే వారిని కఠినంగా శిక్షించేవాడు. అతనితో మెలగడం సన్నిహితులకు కూడా కత్తి మీద సాములా ఉండేది. ఒకనాడు చక్రవర్తి సభలో పాటపాడి తన గానమెలా ఉందని సభికులను ప్రశ్నించాడు. ఏం చెబితే ఏం జరుగుతుందోనని భయపడి ఎవ్వరూ నోరు విప్పలేకపోయారు. చక్రవర్తి దృష్టి సభలో వున్న విదూషకుని మీద పడింది. వినయంగా. విదూషకుడు లేచి ప్రభువుకు నమస్కరించి "ప్రభూ! ఈనాటి మీ పాట ఏమంత బాగా లేదు” అన్నాడు ఖంగుతిన్న చక్రవర్తి ముఖంలో రంగులు మారాయి. "ఎందుకని?” ప్రశ్నించాడు కఠినంగా 'ఈ రోజు విదూషకునికి ఏదో మూడింది' అనుకున్నారు సభలోని వారంతా.