
CHIGURAKU REPAREPALU
₹100
In stock · 5 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
ఒకసారి నామినిగారు మా ఇంటికి వచ్చారు. అదే మొదటిసారి నేను ఆయన్ని చూడటం. నేను ఎక్కువగా సాహితీ సమావేశాల్లో పాల్గొనలేదు. చాలామందితో నాకు ముఖపరిచయాలు కూడా లేవు. నాకంత టైము వుండేది కాదో, ఆసక్తి లేదో... నా ప్రపంచం చాలా చిన్నది. నామినిగారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ హెూదాలో వచ్చారు. నేను సాదరంగా ఆహ్వానించి గౌరవించాను. ఆయన నన్ను ఆంధ్రజ్యోతికి ఒక సీరియల్ రాయమని అడగటం కోసం వచ్చారు. మేము మాట్లాడుతుండగా ఆయన పదే పదే 'ఎంత అన్యాయం' అంటూ చెంపలు వేసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. నేను చివరికి అడిగితే ఆయన చాలా బాధపడుతూ 'ఎలా చెప్పను శారదగారూ! మీ ఎడ్రస్ కోసం ప్రయత్నిస్తే... చాలామంది ఆవిడ లేదు, చచ్చిపోయింది అని చెప్పేరు" అన్నారు బాధగా. నేను బాధపడలేదు, నవ్వాను. 'మరీ ఇంత అన్యాయమా, ఎవరో చెబితే ఫర్వాలేదు, సాటి రచయితలు చెప్పిన మాట ఇది!' అన్నారు ఎంతో నొచ్చుకుంటూ. 'అది నిజమే నామిని గారూ, రచయిత్రిగా నేను చచ్చిపోయానని చెప్పివుంటారు లెండి. ప్రస్తుతం ఏమీ రాయడం లేదు కదా!? అని సమర్ధించేను. మన్నెం శారద దాదాపు వేయి కథలు, నలభయి పైన నవలలు- ఫీచర్స్, పదికి పైగా నంది అవార్డులు పొందిన టి.వి. సీరియల్స్, రేడియో నాటికలు... తెలుగు నవలాలోకంలో “లేడి విత్ ది గోల్డెన్ పెన్" గా పేరుగాంచిన తెలుగువారి అభిమాన రచయిత్రి మన్నెం శారదగారు దశాబ్దకాలపు నిశ్శబ్దం తర్వాత రాసిన మొదటి నవల "చిగురాకు రెపరెపలు”. JV J.V.Publications.