CHIGURAKULU BALAGEYALU by SAHITHI SRAVANTHI Telugu book cover

CHIGURAKULU BALAGEYALU

by SAHITHI SRAVANTHI

₹60
In stock · 2 available
PublisherSAHITHI SRAVANTHI
LanguageTelugu
ISBN9789354376818
పాయల సత్యనారాయణ స్వరస్మృతి దారివెంట ప్రవహిస్తున్నప్పుడు పద్యమొకటి అదాటున చెవిన పడింది రాసిన కవిని మించి పద్యపు ఆత్మను పట్టితెచ్చి పట్టుదారాల మీదనుంచి బంగరురంగు జారినట్లు మెత్తని స్వరపేటిక మీద నుంచి నాలోకి పద్దెపు వంతెన అప్పటికప్పుడే నిర్మించిందా స్వరం. ఫోటోలోని వాళ్ళకోసం గొంతులో దేవులాడి దేవులాడి ఫోటోలోకీ చేరిందంటే నమ్మబుద్ధి అవటం లేదు 978-93-5437-681-8 పిల్లల కోసం పిల్లాడైన సత్యనారాయణగారూ పాయల పాయలగా మీరు పద్యమై.. పాటై.. కథల వూటై... నేలనిట్టా సతత కవితం చేసి కనిపించకుండా పోయారేం. బహుశా ఎక్కడో ఏ లోకంలోనో బువ్వతినక మారాం చేస్తున్న పిల్లలుండి ఉంటారు మెత్తని గొంతులో ఒదిగి బజ్జోవాలనుకునే పద్యాలుండుంటాయి. శృతి సుభగంగా ఎవరు ఆలపిస్తారర్రా అని ఎదుర్చూసే కవిత్వముండి వుంటుంది. పాఠకుడినుండి శ్రోతగా మారి పాటల సెలయేటి మీద పడవేసుకు తిరగాలనుకునే నాలాంటి పిల్లగాళ్లుండి వుంటారు. వాళ్ళకోసం మీరు అక్కడికి వెళ్ళుంటారు. ఒక పద్యమేదో పాడుతూ పిల్లాళ్ళ గుంపులో చేరి కథల భుజాల మీద వాళ్ళను జోకొడుతూ వుండి వుంటారు. సందేహమే లేదు మీరు వుండే వుంటారు అక్కడా ఇక్కడా ఎక్కడ సాహిత్యం పున్నాగపూల పరిమళమై ప్రవహిస్తుందో అక్కడ మీరు వుండే వుంటారు మేం విన్న మీ గొంతు సాక్షిగా మాలోనూ మీరు వుంటారు. - కోసూరి రవికుమార్