CHIGURULU VESINA KALALU by DR.G.V.PURNACAHND Telugu book cover

CHIGURULU VESINA KALALU

by DR.G.V.PURNACAHND

₹80
In stock · 18 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
చిగురులు వేసిన కలలు 1. సౌదామిని "ఇంత తెలిసియుండి యీ గుణమేలరా” క్షేత్రయ్య పదం ఎక్కణ్ణించో దూరంగా వినవస్తోంది. మనసు అటే పరిగెడుతోంది. "పంతమా మువ్వగోపాల నా సామి" అనడుగుతోంది నాయిక, "అలుక చేసి యింటికి రావైతివి" అని నిలదీస్తోంది. నెనరైన చెలికత్తెలున్నారా? పిలువ వచ్చేరా?” అని ప్రశ్నిస్తోంది. భార్యలకు దొరికిపోయిన పరమభర్తల్లాగానే ఆ పరమాత్ముడి దగ్గరకూడా 'చిటిక సమాధానం' లేదు ఈ ప్రశ్నకి. అక్కడికీ నాయిక అనునయంగా అంటోంది. "చెలికత్తెలైన నీవె.. చెలువుడవైన నీవె తలచి చూడ నా పాలి దైవము నీవె" అని! అయినా పరమాత్ముడిలో కదలిక ఉంటేగా! తనవైపు తిప్పుకోవటానికి ఇంతకన్నా ఏం చెప్పి ఒప్పించుకోగలదు...? కలలు మొగ్గతొడిగే వయసది. పెళ్ళినాటికి మొగ్గలు పూలై వికసిస్తాయి. పెళ్ళి తరువాత పూలు కాయలై, కాయలు మొక్కలై చిగురులు వేసినప్పుడు ఆ కలల్లో మాధుర్యం అనుభంలో కొస్తుంది. ఊళ్ళన్నీ తెగతిరిగి ఓ అబ్బాయిని తెచ్చి, "ఇంకనుండీ వీడే నీ మొగుడు" అన్నారు నాన్న,