
CHILD PSYCHOLOGY - PEDDALA BHADYATHA
by SRI SHANMUKHESWARI PRACHURANALU
₹60
In stock · 6 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
ముందుమాట నేటి బాలలే రేపటి పౌరులు! వారు మంచి క్రమశిక్షణతో చక్కగా పెరుగుతూ -విద్యావంతులై... ఎన్నో రంగాల్లో విశేష ప్రతిభలను కనబరుస్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత వాళ్ళ మీదుంది. అందుకు....పసితనం నుండే పిల్లల సంరక్షణ, వాళ్ళలో సరైన నడవడికను అలవాటు చేయండి... విద్యాబుద్ధులు నేర్పించండం మొదలుకుని, వాళ్ళను ప్రయోజకులుగా సమాజం గౌరవించే వ్యక్తులుగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యత తల్లి దండ్రులు, గురువులు మీదే వుంటుంది. పిల్లల అభివృద్ధి విషయంలో తల్లిదండ్రులు, గురువులు ఎన్నో విషయాలు మీద చక్కని అవగాహన ఓర్పు కలిగి వుండాలి. అందుకు..ఆయా వయసులను బట్టి సహజంగా వుండే సైకాలజీని అర్థం చేసుకుంటూ- వారిని సముదాయించడం, నచ్చజెప్పడం, ఏది మంచో ఏది చెడో పిల్లలకు అర్థం అయ్యేలా చెపుతూ... పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించుతూ, తెలివిగలవారిగా తీర్చిదిద్దడం చాలా అవసరం. పిల్లల్లో చదువు, క్షమశిక్షణ గురించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల అభి ప్రాయాలకు కూడా విలువనిస్తూ ఆ అభిప్రాయాలను సునిశితంగా గ్రహిస్తూ అందులోని లోటుపాట్లను వారికి బాగా వివరించగలగాలి. దీనివలన పిల్లల్లో ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఏ విషయంలోనూ పిల్లల మనసులను బాధపర్చ కూడదు... ఓర్పుతో వారిని అర్థం చేసుకోవాలి. తమ పిల్లలు చదువు విషయంలో ఇతర పిల్లల కన్నా వెనకబడుతు న్నారని చాలా మంది తల్లిదండ్రులు అనవసరంగా ఆందోళన చెందు తుంటారు.