
CHINESE AND JAPANESE MARTIAL ARTS
₹60
In stock · 2 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
రచయిత తొలి పలుకులు ఆదాబ్ ఓసు నమస్తే ..... నమస్కార..... ప్రణామ్ హెలో...... సతీశ్రీ అకాల్..... ఒకసారి చూడండి నేడు పెచ్చరిల్లుతున్న హింస సకల మానవా వణక్కం శిని భయభ్రాంతులను చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆత్మ రక్షణ ఒక నిత్యావసర అంశంగా మారింది. మన దేశంలోని ప్రతీ కుగ్రామమంలో కూడా కరాటే విస్తరించినది అంటే ఆశ్చర్యపోవ నక్కరలేదు. అభద్రతా భావాన్ని అధిగమించడానికి కరాటే ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేయటానికి కరాటే ఆపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి కరాటే ...... ఆత్మ రక్షణకు కరాటే ..... దుష్టశిక్షణకు కరాటే వయస్సుతో, కులంతో, వర్గంతో, మతంతో, లింగ భేదంతో పార్టీతో దేనితోనూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోదగిన విద్య "కరాటే" అంతటి విశిష్టమైన యుద్ధ విద్యల్లోని ప్రాథమికాంశాలను ప్రస్తుతీకరిస్తూ "చైనీస్ మరియు జపనీస్ మార్షల్ ఆర్ట్స్ " అనే గ్రంధాన్ని ప్రస్తుతీకరించటం జరిగింది. మరొక అడుగు ముందుకు వేసి కొంచెం ఉన్నతస్థాయి అంశాలను ప్రస్తుతీకరిస్తూ కరాటేలో విజయం మీదే గ్రంథానికి మే 2009లో అంకురం పడింది. ఒక పటిష్టమైన ప్రణాళికతో భారతీయ కరాటే వీరుల కోసం నేను అందిస్తున్న గ్రంథం "కరాటేలో విజయం మీదే". నేను శ్రీ ఎస్.శ్రీనివాసన్, ప్రతాప్ జాకబ్, బి. ఎమ్. నర్సింహన్, నాంగాంగ్, గణేష్, రమేశ్, చ్యూ-చు-సూట్, అలెన్ డ్వయర్, మసయకి హిసటాకా, సియంపోలిఎర్రికో, మిస్గుచి సెన్సాయ్ వంటి అంతర్జాతీయ స్థాయి మాస్టర్ వద్ద కరాటేలోని మెళకువల్ని నేర్చు కున్నాను. గత మూడు దశాబ్దాలలో 10,000కు పైగా విద్యార్థులకు యుద్ధ విద్యలో శిక్షణ నిచ్చాను. 300 మంది బ్లాక్ బెల్ట్ యోధులను తయారు చేశాను. స్వయంగా వందలాది మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్స్లో పాల్గొన్నాను. ఆఫీషియేట్ చేశాను. చాలాసార్లు "ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ గా నిలిచాను.