CHINNA CHINNA VYADHULU CHITKA VAIDYAM by SANGHAMITRA Telugu book cover

CHINNA CHINNA VYADHULU CHITKA VAIDYAM

by SANGHAMITRA

₹30
In stock · 8 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
చిన్న చిన్న వ్యాధులు చిట్కా వైద్యం తలనొప్పి చాలా సాధారణమైన వ్యాధి. అయినప్పటికీ ఏదో ఒక సమయంలో అందరినీ అనేక రకాలుగా బాధించే రుగ్మత ఇది. రకరకాల తలనొప్పులకు రకరకాల కారణాలు ఉంటాయి. ఏ కారణమైనప్పటికీ భరించలేని బాధ వుండటం సహజం. అనేక వ్యాధులలో ఇది కూడా ఒక లక్షణంగా ఉండవచ్చు. ఎండలో ఎక్కువసేపు తిరగడం వలన, మితిమీరి శ్రమించడం, దీర్ఘంగా ఆలోచించడం, బాగా చల్లగా వున్న పదార్ధాలుతినడం, అజీర్తి మొదలైన అనేక సందర్భాలలో తలనొప్పి రావడం సహజం. జలుబు చేసినప్పుడు కూడా వస్తుంది. ముక్కు నుంచి, కళ్ళ వెంబడి నీరు కారుతూ తల మధ్యభాగంలో (మాడు మీద) విపరీతమైన బాధ పొరపొరలుగా వస్తున్న ఫీలింగ్ కలుగు తుంది. ఈ పోటు రాత్రి వేళల్లో చల్లగా వున్నా మరింత ఎక్కువవుతుంది. దీనినే సంస్కృతం లో 'శిరశ్శూల' అంటారు. తల మంటలకుంపటిలా వుంటుంది. ముక్కులో, కళ్ళల్లో వేడి వేడి సెగలు కూడా బయల్దేరతాయి. ఈ సందర్భంలో ఒకటి రెండు మిరియం గింజలను అరగదీసి, ఆ గంధమును మునివేళ్ళతో కంటిలో అతిసున్నితంగా తాకించాలి. కళ్ళు ఒక్కసారిగా భగ్గుమన్నప్పటికీ జలుబు నీరంతా పోయి, కొద్దిసేపటికి తేరుకుంటారు. ప్రశాంతత లభిస్తుంది. ఈ వైద్యం జలుబు మూలంగా తలనొప్పి వచ్చినప్పుడు నివారిస్తుంది. తలనొప్పిలో ఇతర రకాలు కొన్నిటిని పరిశీలిద్దాం. చదువుతున్నప్పుడు తలనొప్పి, ప్రయాసగా ఉండటం, కళ్ళ వెంబడి నీళ్ళు కారడం లక్షణాలతో తలనొప్పి వస్తే కంటి చూపును పరీక్ష చేయించి కళ్ళద్దాలు (కళ్ళ జోడు) వాడటం మంచిది. గుంటకలకరాకు, మిరియాలు కలిపి మెత్తగా నూరి, తలకు పట్టు వేసుకుంటే తలనొప్పులు ఏ రకమైనవైనా తగ్గుతాయి. శొంటిని అరగదీసి, ఆ లేపనాన్ని కణతలకు రెండు వైపులా పట్టువేసినా శిరోభారం తగ్గుతుంది.