
CHINNODIKI PREMATHO-380
₹380
In stock · 3 available
PublisherA.VIJAYALAKSHMI
LanguageTelugu
Chinnodiki Premato... ఉత్తరాలు అనగానే సాహిత్యచరిత్రను అధ్యయనం చేసినవాళ్లకు, సామాన్యులకు అబ్రహం లింకన్ ఉత్తరం, ఇందిర-నెహ్రూల ఉత్తరాలు వంటి కొన్ని ప్రత్యేకంగా స్మృతిపథంలో మెదులుతాయి. ఈ ఉత్తరాలది కొత్త తొవ్వ, విలక్షణ పంథా! ఉత్తరాలన్నీ చదివాక చాలా అంశాల పట్ల మనకు అవగాహన, ఆలోచన కలగడంతోపాటు మనం మన పిల్లలు, మన బడులు, మన కర్రిక్యులం వంటి వాటిపట్ల మరలి చూడకుండా ఉండలేమేమో అనిపిస్తుంది. కారణం ఇందులో అనేకచోట్ల రచయిత్రి తన కొడుకు బడిలో జరిగిన అనేక కార్యక్రమాల గురించి, ఉత్సవాల గురించి చర్చిస్తారు, వాటి గురించి ఆరా తీస్తారు, ఆలోచించేలా చెబుతారు. అనేక అంశాలను తన ఉత్తరాలతో జ్ఞాపకం చేయడం అనేది బహుశః ఆ జ్ఞాపకాలను నిరంతరం తాజాగా ఉంచడం కోసమేకాక ఆ స్ఫూర్తి, చైతన్యం నిరంతరం వెన్నంటి ఉండేందుకు తోడ్పడతాయని భావించడం కావచ్చు. -డా. పత్తిపాక మోహన్ డా. విజయలక్ష్మిగారు వాళ్లబ్బాయిని 5వ తరగతిలో హాస్టల్లో చేర్చినప్పటి నుండి ఆరేళ్లపాటు రాసిన ఉత్తరాలే ఈ పుస్తకం. ఇంచుమించు ప్రతి ఉత్తరంలో ఏదొక అంశం సంక్షిప్తంగా, అనేక కోణాలలో చెప్పబడి ఉంటుంది. పుస్తకం పూర్తిచేసేసరికి అసలీవిడ ముట్టుకోని అంశం లేదా అనిపిస్తుంది. ఇందులో ప్రతి విషయం పిల్లల కోసం, పిల్లల ఆసక్తికి తగినట్టు చెప్పబడి ఉంటుంది. కారణం ఈ ఉత్తరాలు కల్పన కాదు ఒక తల్లి నిజంగా తన పిల్లవాడికి రాసినవి. ఎస్.ఎస్.ఆర్. జగన్నాధరావు ప్రపంచాన్ని, అందులో జరుగుతూన్న అనేక అంశాలను చిన్నుకు చెప్పడానికి- వాళ్ల అమ్మ ఎంపిక చేసుకున్న మాధ్యమం ఉత్తరాలు. చాలామంది వదిలేసిన, మర్చిపోయిన ఉత్తరాల ద్వారా కథల రూపంలో చుట్టూ ఉన్న సమాజాన్ని చూపించింది, పరిచయం చేసింది చిన్ను వాళ్ల అమ్మ నిజానికి అమ్మగానీ, నాన్నగానీ చేయాల్సిన పని ఇదే కదా! ఈ ఉత్తరాల రూపంలో ప్రపంచాన్ని, అందులోని మంచీ చెడులను అనేక రంగులను, విలువలను, మనుషులను, స్వభావాలను చిన్నగా చిన్నూకు కథలాగా చూపించడం అసలైన పని. తల్లిదండ్రులుగానీ, టీచర్స్ గానీ, నాలాంటి తాతలుగానీ పిల్లలకు చెప్పాల్సిన పద్ధతి / విధానం ఇలానే ఉండాలి కదా!! - సి.ఎ. ప్రసాద్ నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో ఇలాంటి పుస్తకాలు అరుదు. నా చిన్నతనంలో మహీధర నళినీమోహన్ సైన్సు పుస్తకాలు, చొప్పదంటు ప్రశ్నలు లాంటివి, కె.బి. గోపాలం, డా. దేవరాజు మహారాజు, సి.వి. సర్వేశ్వరశర్మ వంటి వారి పుస్తకాల సరసన చేర్చదగ్గ పుస్తకం ఇది. ఇంకా చెప్పాలంటే ఎ. ఎస్. నీల్ 'సమ్మర్ హిల్', గిజుబాయి బడేకా 'పగటికల', జపాన్ వారి 'రైలుబడి' లాంటి పుస్తకాల తరహాలో ఇప్పుడు మళ్లీ తెలుగులో ఈ పుస్తకం. -సాకం నాగరాజు