
CHINTAKAYALA BERAM
₹70
In stock · 674 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రాధ ఉపాయం ఒక రోజున రాధ ఏడుస్తూ తరగతి గదిలోకి వచ్చింది. పిల్లలంతా ఒక్కసారిగా రాధవైపు తిరిగి చూశారు. "ఏమ్మా... ఏం జరిగింది?” మాష్టారు ఆదుర్దాగా అడిగారు. “మరండీ! విశ్వనాధం.... నా మూడవ తరగతి పుస్తకం తీసుకొని ఇవ్వడం లేదండీ!" అని పెద్దగా ఏడ్చింది రాధ. “ఏడవకమ్మా! ఏడవకు! నీ పుస్తకం నేను ఇప్పిస్తానులే వుండు" అని ఓదార్చి విశ్వాన్ని పిలిచాడు మాష్టారు. విశ్వం మాష్టారు దగ్గరకువచ్చి వినయంగా నిలబడి, ఏడుపు మొఖంతో "ఈ పుస్తకం నాదేనండి!