CHIRANJEEVI INDIRAKU JAWAHARLAL NEHRU LEKHALU by KATURI VENKATESWARA RAO Telugu book cover

CHIRANJEEVI INDIRAKU JAWAHARLAL NEHRU LEKHALU

by KATURI VENKATESWARA RAO

₹120
In stock · 12 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
జవహర్లాల్ నెహ్రూ జననం:1889. కాశ్మీర దేశస్థులు, తండ్రి ప్రఖ్యాత న్యాయవాది మోతీలాల్ నెహ్రూ. తల్లి: స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ: 'అలహాబాద్' ఇంటివద్దే కొంతకాలం ప్రైవేటుగా చదువుకొని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్య నభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1918లో ఇండియన్ హెూమూల్ లీగుకు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిలభారత కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నారు. 1921లో మొదటిసారి జైలుకు వెళ్లారు. రచనాకాలం నాటికి ఎనిమిది మారులు జైలు శిక్షను అనుభవించారు. 1929లో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు. 1930లోను 1936, 37, 46 లలోనూ కాంగ్రెస్ అధ్యక్షులయినారు. 1950 నుంచి 1955 వరకు కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్నారు. వివాహితులు. భార్య కమలా నెహ్రూ ముందే చనిపోయింది. కొడుకులు లేరు. ఒక్కతే కుమార్తె: 'ఇందిరాగాంధి. చెల్లెల్లు ఇద్దరు:విజయలక్ష్మీ పండిట్, కృష్ణ హతీసింగ్. ఈయన గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు. వీరి రచనలలో 'సోవియట్ రష్యా', 'ప్రపంచ చరిత్ర', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' అన్నవి ప్రసిద్ధమైనవి. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 1964వ సంవత్సరం మే 27న మరణించేవరకు ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. తరువాతి కాలంలో ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానిగా ఎన్నుకోబడి దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు.