CHIRANJEEVI INDIRAKU JAWAHARLAL NEHRULEKHALU by KATURI VENKATESWARA RAO Telugu book cover

CHIRANJEEVI INDIRAKU JAWAHARLAL NEHRULEKHALU

by KATURI VENKATESWARA RAO

₹70
In stock · 16 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
జవహర్లాల్ నెహ్రూ జననం : 1889, కాశ్మీర దేశస్థులు. తండ్రి ప్రఖ్యాత న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ: 'అలహాబాద్' ఇంటివద్దే కొంతకాలం ప్రైవేటుగా చదువుకొని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్య నభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1918లో ఇండియన్ హోమ్రూల్ లీగుకు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిలభారత కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నారు. 1921లో మొదటిసారి కారాగృహ వాసాన్ననుభవించారు. రచనాకాలంనాటికి ఎనిమిది మారులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూచి వచ్చారు. 1929లో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు. 1930లోను 1936, 37, 46లలోనూ కాంగ్రెస్ అధ్యక్షులయినారు. 1950 నుంచి 1955 వరకు కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్నారు. వివాహితులు. భార్య కమలా నెహ్రూ ముందే చనిపోయింది. కొడుకులు లేరు. ఒక్కతే కుమార్తె: ఇందిరాగాంధి. చెల్లెండ్రిద్దరు విజయలక్ష్మి పండిట్, కృష్ణ హతీసింగ్. ఈయన గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు. వీరి రచనలలో 'సోవియట్ రష్యా', 'ప్రపంచ చరిత్ర', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' అన్నవి ప్రసిద్ధ రచనలు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి 1964వ సంవత్సరం మే 27న మరణించేవరకు ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. తరువాతికాలంలో ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానిగా ఎన్నుకోబడి దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004