CHIRASMARANA by NIRANJANA Telugu book cover

CHIRASMARANA

by NIRANJANA

₹120
In stock · 550 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'నిరంజన' గురించి * నిరంజన కలం పేరు, అసలు పేరు కులుకుంద శివరావు, 1924 జూన్ 15న జన్మించారు. బాల్యమంతా దుర్భర దారిద్య్రంలో గడిపారు. 14వ ఏటనే కథానికలు రాయడం ప్రారంభించారు. కర్నాటకకు, కేరళకు సరిహద్దులో వున్న నీలేశ్వర్ హైస్కూలులో చదువుతున్నప్పుడే అజ్ఞాతవాసంలోని విప్లవకారులతో పరిచయమైంది. 1941లో కయ్యూరు రైతాంగ తిరుగుబాటును కళ్ళారా చూశారు. కన్నడ పత్రిక రాష్ట్రబందుకు సంపాదకులుగా పనిచేశారు. 1943లో మంగుళూరులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేశారు. అనంతరం భారత కమ్యూనిస్టుపార్టీలో చేరారు. 1945లో బెంగుళూరు వెళ్ళి ప్రజామత వారపత్రిక ఎడిటర్ ఇన్ఛార్జిగా పనిచేశారు. 1946లో కథానికల ప్రచురణ. ఆ సంవత్సరమే ఎమిలీబర్న్స్ గారి 'వాటీజ్ మార్క్సిజం'? అనువదించారు. 1953 నుంచి రచనే వృత్తిగా స్వీకరించారు. ఆ సంవత్సరమే 'విమోచన' నవల ప్రచురించబడినది. 1954లో 'చిరస్మరణ' అనే ఈ నవలను కన్నడ భాషలో రచించారు. 1956లో రచయిత్రి అనుపమతో పెళ్ళి, అనంతరం అనేక పత్రికలలో కాలమిస్టుగా పనిచేశారు. 1976లో 'మృత్యుంజయ' నవల రాశారు. ఈయనది బాల్యం నుంచి తుదిశ్వాస వరకు ప్రజా ఉద్యమాలతో పెనవేసుకున్న జీవితం. అమరవీరుల స్మారకస్తూపం కయ్యూరు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004