CHIRU GAJJELU by VADDEPALLI KRISHNA Telugu book cover

CHIRU GAJJELU

by VADDEPALLI KRISHNA

₹35
In stock · 9 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1969 నుండి 'ఆకాశ వాణి' ద్వారా లలిత గీత రచయితగా ఖ్యాతి గాంచిన డా॥ వడ్డేపల్లి కృష్ణ 1948లో కరీంనగర్ జిల్లా, సిరిసిల్లలో జన్మించారు. సి. నారాయణరెడ్డి గారి ప్రోత్సాహంతో సాహిత్య రంగానికి, డా|| అక్కినేని నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఇంతవరకు 14 కావ్యాలు, 40 ఆడియో అల్బమ్లు వెలువరించారు. అనేక టెలిఫిలిమ్స్్స్క గాక సీరియల్స్కు, చలనచిత్రాలకు రచన, దర్శకత్వం నిర్వహించారు. ఇటు ప్రభుత్వ, అటు వివిధ సాహిత్య- సాంస్కృతిక సంస్థల ద్వారా అనేక పురస్కారాలను పొందారు. అమెరికా 'ఆటా', 'తానా' సభలకు స్వాగత గీత సంగీత నృత్య రూపకాలను రచించి, 'లలితశ్రీ', 'గేయ కిరీటి' బిరుదాలతో గౌరవ సత్కారాలను గడించారు. ఎవరూ స్పృశించని "తెలుగు లలిత గీతాల" మీద ప్రప్రథమ ప్రామాణిక పరిశోధన చేశారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం (2003)లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2006 & 2009లో ఆంధ్రప్రదేశ్ టీవీ నంది అవార్డుల కమిటీకి చైర్మన్ గా తమ సేవలను అందించారు. 'హాలాహలం' కవితా సంపుటికి దేవులపల్లి పురస్కారాన్ని (1989) 'వడ్డేపల్లి కవిత'కు సినారే సాహితీ గౌతమి పురస్కారాన్ని (1995) ‘వడ్డేపల్లి గేయవల్లి'కి తెలుగు విశ్వవిద్యాలయ గేయ సాహిత్య పురస్కారాన్ని (1998) పొందారు. వీరు రచించిన యీ “చిరు గజ్జెలు" లోని 'చెట్లు', 'పొడుపుకథల పాట' అనే బాల గేయాలు పూనా 'బాలభారతి' (మహారాష్ట్ర) వారి నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశాలుగా చేరడం విశేషం! ఇందలి "మనమంతా ఒక్కటనే మంచి మనస్సు పెరగాలి" అనే బాలగేయం 'ఆకాశవాణి' అన్ని కేంద్రాల్లో తెలుగులో (ప్రాంతీయ అనువాదాలతో) ప్రసారమై జాతీయస్థాయి గుర్తింపును పొందడం ప్రశంసనీయం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 4-1-435, విజ్ఞాన భవన్, బ్యాంక్ట్, హైదరాబాద్-500 001.