CHITRABHARATHI by VASIRAJU PRAKASAM Telugu book cover

CHITRABHARATHI

by VASIRAJU PRAKASAM

₹300
In stock · 69 available
PublisherVASIRAJU PRAKASAM
LanguageTelugu
'వార్త'కు వందనం తెలుగువారి అభిమాన దినపత్రిక 'వార్త' తొలిరోజులనుండీ ఆరంభమైన శీర్షిక యీ 'చిత్రభారతి'. దశాబ్దకాలం దాటింది. కేవలం తెలుగు సినిమాకే పరిమితం చేయక భారతదేశంలోని వివిధ భాషల్లో తయారవుతున్న సినిమాల గురించి, అందులో కృషిచేసిన కళాకారులు, సాంకేతిక నిపుణుల గురించి యీ సుదీర్ఘకాలంలో ఎలాంటి పరిస్థితుల్లోను ఒక్కవారం కూడా విడువకుండా ప్రచురింపబడిన యీ 'చిత్రభారతి' శీర్షికకు రెండుసార్లు జాతీయస్థాయిన రాష్ట్రపతి పురస్కారాలు, మూడు బంగారు నంది పురస్కారాలు రావటంలో యీ గౌరవంలో అధిక భాగం మా 'వార్త' యాజమాన్యం శ్రీ గిరీష సంఘీగారిదే. 'వార్త' అధినేతగా ఆయన ఎన్నో విజయాలను సాధించారు. ఆదర్శమూర్తిగా నిలిచారు. ఉత్తమ అధిపతి మాత్రమే కాదు. ఆయన మానవత్వం తెలిసిన మంచిమనిషి, ఈ 'చిత్రభారతి' విజయానికి శ్రీగిరీష్ సంఘీ అందించిన ప్రోత్సాహం, అలాగే 'వార్త' సంపాదక విభాగాల్లో ప్రతిఒక్కరూ వ్యక్తపరిచిన ఆత్మీయత యీ రచయిత హృదయంలో చిరకాలం గూడుకట్టుకుని వుంటాయి. 'వార్త' నిర్వహణా బాధ్యతలతోపాటు, శ్రీగిరీష్ సంఘీ సమర్థుడైన ప్రజాప్రతినిధిగా ఎంతో ఎత్తుకు ఎదిగారు, రాజ్యసభసభ్యులయినారు. భారతీయ వైశ్య సోదరులకు ఆదర్శనాయకు లయ్యారు. ఈ పరిణామదశలో 'వార్త' నిర్వహణాభారాన్ని వారి పుత్రుడు శ్రీగౌరవ్ సంఘీ కూడా చేపట్టారు. వయస్సులో చిన్నవాడయినా, మనస్సులో పెద్దరికం సంపాదించుకున్న గౌరవ్ సంఘీ. అతి చిన్నవయస్సులో, యీ పెనుభారాన్ని స్వీకరించి, తండ్రి ఆశలు, ఆశయాలకు తగినట్లు 'వార్త' పత్రికలను ప్రగతిపథంలోకి తీసుకువెళుతున్న యువ ప్రతిభాశాలి గౌరవ్ సంఘీ మరోవైపు 'జేడ్' అనే ఆంగ్ల ఫ్యాషన్ మాసపత్రికను అత్యంత సమర్థవంతంగా నడుపుతున్నారు. తండ్రికి తగిన తనయుడిగా ఆబాలగోపాల ప్రశంసలు అందుకున్న శ్రీ గౌరవ్ సంఘీ ఎంతో ఉజ్జ్వల భవితకు ఓ పూలబాట!