
CHITTACHIVARI REDIO NATAAKAM
₹250
In stock · 25 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చిట్టచివరి రేడియోనాటకం రికార్డింగ్ స్టూడియో చల్లగా, మెత్తగా, మంచు అడవుల మధ్య నడుస్తున్నట్లుగా వుంది. "వెల్కమ్!" మెల్లగా గొంతు విప్పింది మాధవి. "స్టేజీ లేదు! కర్టెన్లు లేవు! రంగులు పులమటాలు, ముతక కంపు కొట్టే డ్రస్సింగులు లేవు! పేజీల కొద్దీ డైలాగులు, ప్రామ్లింగులు లేవు! అసలీ నాటకానికి స్క్రిప్ట్ లేదు," క్షణంసేపు ఆపి వాళ్ళ వైపు చూసింది. నిర్లిప్తంగా, అపనమ్మకంగా వున్నాయి ఆ ముగ్గురి ముఖాలు. "వెనక్కు, గతంలోకి కాళ్ళు తగిలినంత మేరకు ప్రయా ణిద్దాము! ఈ ప్రయాణమే మన నాటకానికి కథావస్తువు!" ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోతోంది మాధవి. కుర్చీల్లో దిగవేసిన మూడు నిశ్శబ్దపు ముద్దల్లా, వాళ్ళలో పెద్దగా చలనం లేదు. "ఇది నా చిట్టచివరి రేడియో నాటకం! ప్రెక్స్గా నా జీవితం చాలిస్తున్నాను. భ్రమలు విడిపోవటం! నిస్పృహ! ఇరవై ఆరేళ్ళ వయస్సు! ఏ ఎగ్జిట్మెంటు లేకుండా మామూలుగా బతకడానికి అంగీకరించని వయసు, కాలేజీ జీవితం ఇట్లాగే డిజెక్టెడ్గా, అనా సక్తంగా వుండేది. రేడియోల్లోకి దూకాను, ఇక్కడా అదే అనాసక్తత! పొరలు పొరలుగా ఎడారి ఇసుకమేటలు వేస్తున్నట్లుగా! నీరు అవసరం