CHITTADAVILO CHINNIPRANULU by D.SUJATHA DEVI Telugu book cover

CHITTADAVILO CHINNIPRANULU

by D.SUJATHA DEVI

₹50
In stock · 565 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చిట్టడవిలో చిన్నప్రాణులు అదొక చిట్టడవి. ఆ అడవి ఎప్పుడూ చిన్నా, పెద్దా జంతువుల అరుపులతో, రకరకాల పక్షులు కూతలతో, సందడిగా ఉంటుంది. అక్కడక్కడా గుత్తులు గుత్తులుగా పూసిన అడవి పూల సువాసన అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మధ్యన చిన్న నీటిగుంట ఉంది. ఆ గుంట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఒక కోతి ఆ చెట్ల కొమ్మల మీద దూకుతూ ఆకులన్నీ దూసి నీళ్ళలోకి విసురుతోంది. “ఏమిటమ్మా ఆ దూకుడు? కాయలో పళ్ళో అయితే పిల్లలు తింటారు. ఈ ఆకులేమిటి.... బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు" నీళ్ళలోంచి బయటకొచ్చి విసుగ్గా అంది ఓ తాబేలు. "పళ్ళు కావాలని మర్యాదగా అడగవచ్చు కదా!” అంది కోతి. అంటూనే చకచకా అవతలి చెట్ల మీదకి దూకేసింది పళ్ళ కోసం . "కావు.... కావు...." అని అరుచుకుంటూ ఆయాసంగా అక్కడ వాలింది ఓ కాకి. కాకి పిలుపుకు నెమ్మదిగా ఒడ్డు దగ్గరగా వచ్చింది తాబేలు. "ఏరీ వీళ్ళంతా... అంతదూరం నుంచీ ఎంతో ఆత్రంగా... ఎగురుకుంటూ వచ్చాను. తీరా చూస్తే ఇక్కడెవరూ లేరు". అంది కాకి నిరాశగా.