
CHITTAGANG VIPLAVA VANITHALU - 80
₹80
In stock · 17 available
PublisherCHAITHANYA PINGALI
LanguageTelugu
ప్రతీ అంశాన్ని ఇప్పుడు స్త్రీల దృక్కోణం నుండి చూడాల్సిందే ! మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు. భారతదేశానికి స్వతంత్రం రాక 17 ఏళ్ళ ముందు ఈ నేల మీద కొంత భూభాగం.. స్వతంత్రం పొందింది! మన త్రివర్ణపతాకం స్వేచ్ఛగా ఎగిరిన ఆ నేల చిట్టగాంగ్. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన 'ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ' సాధించిన ఘనత ఇది. ఐ.ఆర్.ఎకి ఉన్న మరో ప్రత్యేకత.. వ్యక్తిగత విప్లవ పోరాటాల్లో కాక, మహిళలు పూర్తి స్థాయి సభ్యులుగా ఒక రహస్య సంస్ధలో చేరి, సాయుధంగా పోరాడటం అనేది ఈ సంస్థతోనే మొదలు. ఈ 'మొదటి అడుగు' వేయటానికి.. ఐ.ఆర్.ఎలో పని చేసిన స్త్రీలు సమాజంతో, కుటుంబంతో, అంతరాత్మతో, చివరికి తమ సంస్థతో కూడా చేసిన ఆ నిరుపమాన పోరాటాన్ని.. మన ముందుకు తీసుకొచ్చేందుకు 'విజయవిహారం' మాస పత్రిక సబ్ ఎడిటర్, కాలమిస్టుగా పని చేసిన పింగళి చైతన్య.. చేసిన ప్రయత్నమే ఈ చిట్టగాంగ్ విప్లవ వనితలు