
CHITTIRAJU GUNI GURRAM - 50
₹50
In stock · 680 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఇదీ భూమిక ఒకనాడు బాల సాహిత్యంలో వెల్లువలా, పూలజల్లులా విరిసిన కథలూ, పాటలూ అంతలోనే ఆగిపోయినట్టనిపిస్తోంది. శారు. మ్యూని సాధార డో కు స్కూల్ మొవజన దాలతో లిచార 984,1 రాజు ర్మాతల్లో టకాల ంటి వీ ద్రాబాద్ రోగ్య ఫామిలీ స్టోరీలూ, ఎటర్నల్ ట్రయాంగిల్ లాంటి మధ్యతరగతి బాపతు తప్పిస్తే బాలల సంగతి పట్టించుకునేవారే కనిపించడంలేదు. వాళ్ళ మనోవికాసం గురించి మధనపడే కవులూ, కళాకారుల గొంతే వినిపించడంలేదు. పత్రికలో మంచి బాలల శీర్షిక కావాలంటున్న సమయంలో 'మేమిస్తాం' అంటూ ఇద్దరు హుషారైన యువకులొచ్చారు. నాటకాల రచనా, జర్నలిజం, కవిత్వం తప్పితే బాల సాహిత్యంలో ప్రవేశం లేనివాళ్ళు. ఉత్సాహం మాత్రం అగుపిస్తోంది. రాసిన నవల చూస్తే చేయితిరిగిన రచనలాగే కన్పించింది. ఔత్సాహికుల చిక్కులున్నమాట నిజమే. అయినా ప్రోత్సహించడం నా బాధ్యత అన్పించింది. ఎలాగో సీరియ ప్రచురణకి ధైర్యం చేశాం. పాఠకుల ఆదరణ మాత్రం మా అంచనాల్ని దాటిపోయింది. అంతకు మించిన ఆనందు నాకు గానీ, ఈ యువకులకు గాని మరేముంటుంది? అందుకే ప్రబోధాత్మకమైన గేయకథలూ నవలా రాయలని కోరాం. వారి సృజనాత్మక కృషీ అద్భుతంగా వుంది. మాత్రాబద్ధ కవిత్వంలో సరస భాషలో బాలల్ని ఇట్టే ఆకట్టుకునే పాటల్ని రాజేశ్వరరావు అందంగా కూర్చారు. వాటి భావి ప్రకటనకి సంపూర్ణ రూపమిస్తూ మోహన్ బొమ్మలు గీశారు. ఈ జంట మరిన్ని చక్కని కధల్ని తెలుగు సాహితీలోకానికి అందిస్తుందని నా ఆశ. విరామ మెరుగక సాగే వీరి శ్రమ ఫలిస్తుందని నా ఆకాంక్ష. ముక్కామల నాగభూషణం సంపాదకులు : ప్రగతి విశాలాంధ్ర విజ్ఞాన సమితి ప్రచురించిన ప్రగతి సచిత్ర వారపత్రికలో సీరియల్గా 1974లో ప్రచురితమై 1975లో నవలగా పుస్తక రూపంలో వచ్చినప్పుడు శ్రీ ముక్కామల నాగభూషణం వ్రాసినది.