
CHIVARI GUDISE - MOOGAVANI PILLANAGROVI
₹45
In stock · 3 available
PublisherREETHIKA PUBLICATIONS
LanguageTelugu
డా|| కేశవరెడ్డి - తనలోని ఏకాంతాన్ని పూడ్చుకోవాలన్న తపనతో కలం పట్టినవాడు. వృత్తిపరంగానూ, ప్రవృత్తి పరంగానూ, చికిత్సే ప్రధాన ధ్యేయంగా ఎంచినవాడు పుస్తకాల వల్ల ప్రపంచం మారదనే స్పృహ వుండి, ఎప్పటికైనా సమాజాన్ని మార్చేది భౌతిక పరిస్థితులేనని గ్రహించి, సమాజం మారటానికి రచనలు ఇతోధికంగా సహాయం చేస్తాయనే విశ్వాసంతో పాతిక సం॥లుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో, రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా, తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న వాడు “బానిసలు, భగవానువాచ" (1975), "ఇన్క్రెడిబుల్ గాడెస్" (1977) (ఇది మరాఠిలోకి అనువాదమైంది), "స్మశానం దున్నేరు" (1979), "రాముడుండాడు రాజ్యముండాది" (1986), “సిటీ బ్యూటిఫుల్” (1986) - అనేవి యితని యితర రచనలు కాగా "అతడు అడవిని జయించాడు" - నవల మొదట 1984లో ఆంధ్రపత్రిక వీక్లీలో సీరియల్గా వచ్చింది. 1985లో పుస్తకంగా వెలువడింది, 1996లో పునరుద్రణ పొందింది. నేషనల్ బుక్ ట్రస్టు వారు ఈ నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. ఇప్పటికే హిందీ, తమిళం అనువాదాలు వెలువడ్డాయి. ఉద్యోగమూ, రచనా వ్యాసంగం తప్ప మరే యితర వ్యాపకమూ లేని ఇతగాడు చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టాడు. వర్ణాంతరమూ, మతాంతరమూ అయిన వివాహం, కొడుకూ, కూతురూ సంతానం తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్ చేశాక, నిజామాబాద్ జిల్లా - డిచ్పల్లి విక్టోరియా మోమోరియల్ ఆస్పత్రిలో 19 సం॥లుగా మెడికల్ ఆఫీసరు ఉద్యోగం ఇతనిది నిష్కల్మశమైన మనస్సు, నిర్మొహమాటమైన మాట, నిరాడంబరమూ, సాధారణమూ అయిన జీవితం వ్యక్తిని, సమాజాన్ని పట్టి పల్లార్చే రుగ్మతలను తొలగగొట్టి, తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలిక పర్చడం, అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమింప జేయటమే లక్ష్యం