CHOOPU by SHASHI SREE Telugu book cover

CHOOPU

by SHASHI SREE

₹90
In stock · 122 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
CHOOPU అయిదు వదులకు పైగా వయనుగల ఈ సాహిత్యకారుడు-‘శశిశ్రీ'గా ప్రసిద్ధులు. పూర్తి పేరు - షేక్ బేపారి రహమతుల్లా, కడప జిల్లా సిద్దవటం జన్మస్థలం. కార్యక్షేత్రం కడప. కవి, రచయిత, వక్త, సాహిత్యనేత్రం పత్రిక ఎడిటర్, ప్రసారభారతి న్యూస్ రిపోర్టర్ అయిన శశిశ్రీ 32 సం॥లుగా నిబద్ధ సేవలందిస్తున్నారు. ఈయన ప్రతిభా పాటవాలకు గుర్తింపు గౌరవాలుగా ఎన్నో అవార్డులు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి- 'ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం -2010. శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి-పట్టాభిరామిరెడ్డి లిటరరీ అవార్డు-2008' స్వీకరించారు. నందలూరి కథానిలయం నుండి-'ఉత్తమ సాహిత్య సంపాదకుడు', గుంటూరు అభ్యుదయ రచయితల నుండి కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పురస్కారం -2008 గ్రహించారు. పాత్రికేయ రంగ ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి- 'ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు-2007' (రూ. లక్షనగదుతో) స్వీకరించారు. అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ వారి ప్రతిష్ఠాత్మక పురస్కారమైన UNICEF AWARD -2010 అందుకున్నారు. శశిశ్రీ విద్యారంగ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నరుచే యోగివేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా నియమితులై సేవలందిస్తున్నారు. 'అరసం' రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులుగా ఉంటున్న శశిశ్రీ రచనలలో ముఖ్యమైనవి కొన్ని-పల్లవి, శబ్దానికి స్వాగతం, జేబులో సూర్యుడు, కాలాంతవేళ వచన కావ్యాలు; సీమగీతం పద్యకావ్యం; దహేజ్, TUNES OF LIFE రాతిలోతేమ కథాసంపుటాలు; మనకు తెలియని కడప చరిత్ర పుస్తకం పేర్కొనదగినవి. శశిశ్రీ కథలు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కన్నడ, మలయాళ భాషలలో అనువాదమయ్యాయి. VPH01101532 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్' 4-1-435, విజ్ఞాన భవన్, బ్యాంక్ట్, హైదరాబాద్-500 001. ఆంధ్ర పబ్లిషింగ్ త