CIVICS DRAMALU by SARWARAYUDU Telugu book cover

CIVICS DRAMALU

by SARWARAYUDU

₹45
In stock · 382 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పుస్తకం గురించి ఈ నాటికలకు పునాది సమకాలీనత, సామాజికత, దేశీయత, వాస్తవికత.!! చిన్న చిన్న నాటికలతో కూడిన ఈ సంపుటిలోని మొదటి నాటిక 'గ్రామకచ్చేరి' తన కాలంనాటి గ్రామీణసామాజికత యితివృత్తంగా దేశీయతా ముద్రతో వాస్తవిక జీవిత సమస్య కేంద్రంగా నడుస్తుంది. ఒక గ్రామంలోని కరణం, మునసబులు రైతులనుండి శిస్తులు వసూలు చేయటం, శిస్తులు చెల్లించనివారిని శిక్షించటం ఇందులోని యితివృత్తం. ఇంకా ఈ నాటికలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆక్రమాలు, పోలీసువ్యవస్థ దుర్మార్గాలు, న్యాయవ్యవస్థలోని అన్యాయాలు, పన్నుల పేరిట మునిసిపాలిటీల దోపిడీ, లంచగొండి వ్యవస్థ, మద్యపానంపై నిరసన, మూఢాచారాలపై దాడి యిలా పలు అంశాలు చోటు చేసుకున్నాయి. సామాజిక రుగ్మతలపై ధ్వజమెత్తటం, హేతుబద్ధమైన ఆలోచనలను ఆహ్వానించటం కనిపిస్తుంది. రచయిత సర్వారాయఁడు ఆనాడు తనకున్న పరిమితులలోనే ఒక సంక్షేమ సమాజాన్ని ఆకాంక్షించి ఈ నాటికలను రచించారనేది స్పష్టమవుతుంది. గిడుగువారి వ్యవహారిక భాషోద్యమాన్ని, గురజాడవారు ప్రతిపాదించిన ఆధునిక భావాలను స్వీకరించి శృంగారకవి సర్వారాయఁడుగారు ఈ నాటికలలో ప్రతిభావంతంగా చిత్రించారు. ఈ తరం రచయితలు ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకం చదివితే మన ఆలోచనా పరిధులను విస్తృత పరిచిన తొలి తెలుగు నాటికా పరిణామం, వికాసం తెలుస్తుంది. అందరు తప్పక చదవాల్సిన వందేళ్ళ ప్రసిద్ధ తెలుగు నాటికల సంకలనాలు ప్రయోజనాత్మక - హాస్య, వ్యంగ్య రచనలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ బ్యాంక్ స్ట్రీట్, అబిడ్స్ - హైదరాబాద్ - 500 001. VPH01100749