COMMUNIST NEETI by KAMBAMPATI SATYANARAYANA Telugu book cover

COMMUNIST NEETI

by KAMBAMPATI SATYANARAYANA

₹30
In stock · 383 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మానవజాతికి అత్యధికంగా మేలు చేయగల వృత్తిని మనం ఎంచుకున్నట్లయితే, మనం దేనికీ తలవంచనవసరం లేదు. ఎందుచేతంటే, అది అందరి కోసం చేసే త్యాగం. అప్పుడు మనం పొందే ఆనందం అల్పమైనది కాదు. ఎందుచేతంటే, లక్షలాది ప్రజల సౌఖ్యమే మన సౌఖ్యం అవుతుంది. మన కార్యాలు ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతాయి ; మన అస్తికలు మహానుభావుల అశృధారలతో పునీతమవుతాయి. -కార్ల్ మార్క్స్ గతంలో సమాజం వర్గ వైషమ్యాల ద్వారా వృద్ధి చెందినందున నీతి ఎల్లప్పుడూ వర్గ నీతిగానే ఉంటూ వచ్చింది. అది పాలకవర్గ ప్రయోజనాల్నీ, పెత్తనాన్నీ సమర్థించడమైనా చేసింది; లేదా పీడిత వర్గం తగినంత శక్తిని పుంజుకున్నప్పటి నుంచీ ఆ పెత్తనం పట్ల పీడిత వర్గ ఆగ్రహాన్నీ, ఆ వర్గ భవిష్యత్ ప్రయోజనాల్నీ ప్రకటించడమైనా చేసింది. ఈ క్రమంలో మొత్తం మీద మిగతా జ్ఞాన రంగాలన్నిటిలాగే నీతి కూడా అభివృద్ధి చెందిందనడంలో సందేహం లేదు. కాని మనమింకా వర్గ నీతిని అధిగమించలేదు. సమాజం ఏ దిశలో వర్గ వైషమ్యాలను అధిగమిస్తుందో దానితోబాటు ఏ దశలో వాటిని నిత్య జీవితంలో మరచిపోతుందో ఆ దశలో మాత్రమే నిజమైన మానవ నీతి వర్గ వైషమ్యాల కతీతమైనట్టిది, వాటి జ్ఞాపకాల కతీతమైనట్టిది సాధ్యపడుతుంది. - ఎంగెల్స్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ శ్రీ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.