COOL DRINKS JUICES by NAVAJYOTHI PUBLICATIONS Telugu book cover

COOL DRINKS JUICES

by NAVAJYOTHI PUBLICATIONS

₹10
In stock · 1 available
PublisherNAVAJYOTHI PUBLICATIONS
LanguageTelugu
కూల్ = కూల్ = కూల్ డ్రింక్స్ వేసవి వస్తున్నదంటే కూల్డ్రింక్ల హోరూ ఎక్కు పయినట్లే. ఎండలో బయటకు వెళ్ళి వచ్చి ఆపసోపాలు పడే వారికి చల్లని డ్రింక్ ఇచ్చేసరికి, ఆ అలసకు అంతా క్షణంలో పోయి, ముఖం సేదతీరి కళకళలాడుతుంది. అనుకోని అతిధులకు చల్లని డ్రింక్స్ ఇస్తే చాలు, ఎంతో సంతృప్తి చెందుతారు. బజారులో దొరికే కూల్ డ్రింక్ కోసం, అతిధులు రాగానే, పిల్లలను పరుగులమీద పంపి, తెప్పించి ఇస్తుంటాము. అయితే, ఈ ఆతిధ్యంతో అంత ఆప్యాయత కనిపించదు. ఏదో వచ్చారు కాబట్టి ఇచ్చాము అన్నట్లే వుంటుంది. అదీగాక, బజారులో అందంగా, ఆకర్ష ణీయంగా కనిపించాలని రకరకాల రంగులు, వాససలకోసం ఎన్నో రసాయన పదార్థాలు కలుపుతుంటారు. వాటితో చాలా వరకూ మన ఆరోగ్యానికి హాని చేసేవే. అంతేగాక, చాలా ఖరీదు కూడానూ. మనం ఇంట్లోనే రకరకాల డ్రింక్లు, జ్యూస్లు, స్క్వాష్లు, సిరప్లు తయారుచేసుకోవచ్చును. నిలువ ఉంచు కునేవి కొన్నయితే, తాజాగా చేసుకునే రకాలు మరికొన్ని, ఇవన్నీ తృప్తినిస్తాయి. మరి ఇంట్లో ఏదయినా పార్టీ జరిగిందనుకోండి. బయట రెస్టారెంట్లలో ఎంతో ఖరీదు పెట్టి, వింత వింత పేర్లతో వున్న ఫ్రూట్పంచ్లను ఆర్డరుమీద తెప్పించేకంటే, కొంచెం శ్రమతో అంతే రుచిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం తయారుచేసిన డ్రింక్ మన జేబుథి ఆదాచేస్తే వచ్చిన అతిధుల మెప్పుకోళ్ళు మనకెంతో తృప్తినిస్తాయి. మరింకేం, వెంటనే, మంచి జ్యూస్లు, స్క్వాష్లు తయారుచేసి చిక్కని ఫ్రూట్పంచ్ మిల్క్ షేక్లతో మీ కుటుంబ సభ్యులను ఆనందాశ్చర్యాలలో ముంచె తండి.