CORONA AATMA KATHA by YASASWI Telugu book cover

CORONA AATMA KATHA

by YASASWI

₹100
In stock · 75 available
PublisherYASASWI
LanguageTelugu
నా నోట ప్రకృతి మాట కరోనా 2019 2020 సంవత్సరాలనే కాదు రాబోయే ఎన్నో వత్సరాలను కూడా ఇబ్బంది పెట్టబోయే వైరస్. ఇది భయపెట్టడానికి వ్రాస్తున్న పుస్తకం కాదు కాబట్టి మీరు నా మాటలను సహృదయంతో అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ పుస్తకం ఇలాంటి వైరస్ల గురించి అవగాహన కలిగించి జనులను చైతన్యపరచడానికి ఎంతో సమయాన్ని వెచ్చించి మీ చేతుల్లో పెడుతున్నాము. మొన్న సార్స్, నిన్న ఎబోలా, నేడు కరోనా అన్నట్లు తయారైంది విశ్వమానవుడి పరిస్థితి. అంటే ఏమిటంటే పర్యావరణము, జీవవైవిధ్యము, పరిసరాల పరిశుభ్రత, భూతాపము అన్నీ మనం జాగ్రత్తగా చూసుకొంటూ మనుగడ సాగిస్తే మనిషి మీద వాటి తీవ్రత అతి తక్కువగా ఉంటుంది. జలుబులాంటి (కామన్ కోల్డ్) సాధారణ చిన్నశ్వాస ఇబ్బందిని కలిగించే వైరస్ లాంటిదే ఈ కరోనా కూడా. కానీ పర్యావరణ అసమతుల్యత, ఓజోన్ పొర పాడవ్వడం, భూతాపం పెరగడం, పరిసరాల అపరిశుభ్రత, పచ్చదనం తగ్గిపోవడం జీవవైవిధ్యం దెబ్బతినడం వెరసి సాధారణంగా ఏమీ చెయ్యని వైరస్ల ఉత్పరివర్తన (మ్యూటేషన్) చెంది మానవ మేధస్సుకి కూడా అందనంత ఎత్తుకి ఎదిగిపోయి అదృశ్య మాయావిలా మారణ హోమం సృష్టిస్తున్నాయి. జీవవైవిధ్యము అంటే మనతోపాటు ఉన్న జీవజాలాన్ని వాటి పరిధిలో అవి బతికేలా సహకరిస్తూ వాటితో సహజీవనం చెయ్యడం. మనం వాటిని హింసించడం, చంపడం, వాటి ఆవాసాల్లోకి వెళ్లడం, వాటికి ఆహారం, నీరు దొరక్కుండా చెయ్యడం వల్లే అవి మన ఆవాసాల్లోకి వచ్చి మనల్ని హింసిస్తున్నాయి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పిల్లినైనా హింసిస్తే అది పులిలా ప్రాణానికి తెగించి మీదపడుతుంది. అలాంటిదే ఈ చిన్న ఆకారంలేని నిర్జీవి వైరస్ కూడా విజృంభించి మృత్యువిహారం చెయ్యడానికి కారణం. గబ్బిలంలో ఉన్నవి బయటికి వచ్చి ఉత్పరివర్తన చెంది మనిషికణాల్లో తామరతంపరలుగా పెరిగిపోయి జబ్బులు, మరణాలు కలిగిస్తున్నాయి. అలా "అంతకుముందు చాలా వైరస్లు వచ్చాయి. ఎబోలా వైరస్ కోతులనుండి మనిషికి, సార్స్ కరోనా ఒకటి గబ్బిలాల నుండి పునుగు పిల్లులకు వాటినుండి మనిషికి, ఒంటిగుబ్బ ఒంటెలనుండి మెర్స్ కరోనా వైరస్, హెచ్ ఐ వీ వైరస్ కోతులనుండి స్వలింగసంపర్కులకు, కుక్కల నుండి రేబీస్ వైరస్, దోమలనుండి చికున్ గున్యా వైరస్, సార్స్ కోవ్ 2 (నేటి కరోనా - కోవిడ్ 19) గబ్బిలాల నుండి మనిషికి ఇలా ఇప్పటికే మానవాళి ఎన్నో వైరస్ లేక బాక్టీరియాల బారినపడి నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఒక కోటి 22 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 5 లక్షల 53 వేలమంది చనిపోయారు.