CURRENT KATHA by DR.MAHEEDHARA NALINI MOHAN Telugu book cover

CURRENT KATHA

by DR.MAHEEDHARA NALINI MOHAN

₹200
In stock · 115 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
CURRENT KATHA by Dr. Maheedhara Nalinimohan స్వాతంత్ర్యోద్యమ సమరంలో ముగ్గురు కుటుంబ సభ్యులను జైలుకు పంపిన దేశభక్తుల ఇంట్లో మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలకు వేదికగా నిల్చిన ముంగిట్లో ఛాందసాన్ని వెలివేసిన పండిత కుటుంబంలో - 1933లో తూర్పు గోదావరి జిల్లా ముంగండలో జననం. 1953 555 ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ. 1960-63లో మాస్కో యూనివర్శిటీ నుంచి డాక్టరేటు డిగ్రీ తీసుకున్నారు. 1969-71లో స్వీడన్లోని ఉప్సాలా అయనోస్పెరిక్ అబ్జర్వేటరీలోనూ, 1974-75లో బల్గేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోనూ, 1981-82లో ఇంగ్లండులో యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వేల్స్లోనూ స్పేస్ రీసెర్చ్ చేశారు. ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో డిప్యూటీ డైరెక్టరుగా అంతరిక్ష పరిశోధన చేస్తూ 18 రాకెట్టు ప్రయోగాలలో పాల్గొని, 1993లో రిటైరు అయ్యారు. 15వ ఏట నుంచీ కవిత్వ రచనలో ప్రవేశం వున్న నళినీమోహన్ పాపులర్ సైన్స్లో 38 పుస్తకాలు, పిల్లల కోసం 18 పుస్తకాలు, కవితలూ, వ్యాసాలు వగైరా 9 పుస్తకాలు రాశారు. వివిధ తెలుగు పత్రికలలో వీరి రచనలు 1550కి పైగా ప్రచురితమయ్యాయి. 1968లో కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని వైజ్ఞానిక రచనల ద్వారా ప్రజా బాహుళ్యానికి సైన్సుమీద అభిమానం కలిగిస్తున్నందుకు, 1986లో ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతిని ప్రప్రథమంగానూ అందుకున్నారు. ఆంధ్రజ్యోతి వీక్లీ నిర్వహించిన బాలెట్లో 1986లో తెలుగువారిలో ప్రముఖ వ్యక్తిగా ఎన్నికయ్యారు. సుప్రసిద్ధ నవలా రచయిత, జర్నలిస్టు కీ॥శే॥ శ్రీ మహీధర రామమోహనరావుగారు వీరి తండ్రి. బహు గ్రంథకర్త శ్రీ మహీధర జగన్మోహనరావుగారు వీరి పినతండ్రి. హోమియో వైద్యం వీరి హాబీ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004