DAKSHAYANI VELAYUDHAN by RAMANA MURTHY Telugu book cover

DAKSHAYANI VELAYUDHAN

by RAMANA MURTHY

₹200
In stock · 22 available
PublisherJAI BHARATH PUBLICATIONS
LanguageTelugu
ಆಮ మలబార్ తీరంలోని.. పులయ సామాజిక వర్గంలో మొట్టమొదటి సారిగా పైవస్త్రం ధరించి పాఠశాలకి హాజరైన బాలిక, కొచ్చిన్ సంస్థానంలో ఇఎస్ఎల్సిలో (ఇవ్వాళ 10వ తరగతితో సమానం) ఉత్తీర్ణురాలైన మొదటి యువతి, పట్టభద్రురాలైన భారత దేశపు తొలి దళిత మహిళ, అందునా.. మొట్టమొదటి సైన్స్ గ్రాడ్యుయేట్, కొచ్చిన్ శాసన మండలికి ఎంపికైన దళిత మహిళ, భారత రాజ్యాంగ రచనా సభలో ఏకైక దళిత మహిళ, గాంధీజీ, అంబేద్కర్, రాజగోపాలాచారి, నెహ్రూ, పటేల్.. వంటి మహామహులతో కలిసి నడిచిన ధీర, స్వతంత్ర భారతంలో.. దళితులు, అన్ని రంగాల్లో అగ్రకులాలతో సమానంగా ..పురోగమిస్తారనీ, కులాలు అంతిమంగా నశిస్తాయనీ ..కల కన్న స్వాప్నికురాలు, దళితులు భావి పాలకులని భవిష్యద్దర్శనం చేసిన ధీశాలి, బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయవాద శక్తులతో చెయ్యి కలపాలని.. రాజ్యాంగ రచనాసభ వేదిక నుంచే.. పిలుపు ఇచ్చిన సాహసి, కుల, వర్గ, లింగ అసమానతల పరిసమాప్తికి పరిశ్రమించిన పోరాటశీలి, ఆశయాన్నీ, జీవితాన్నీ మేళవించి అడుగులు వేసిన ధన్య, రాజకీయ, శాసన, మేధో, గృహ, పాత్రికేయ, ఉద్యమ రంగాల్లో ఏకకాలంలోనే తుది శ్వాస వరకూ పరిశ్రమిస్తూ.. అనన్య సామాన్య విజయాలు సాధించిన యోధ, తరతరాలకీ ధైర్యాన్నీ, ఆలంబననీ, స్ఫూర్తినీ అందించగల వారసత్వం ఆమెది, దేశం ఉనికిలో ఉన్నంత వరకూ చెరిగిపోని చరిత్ర ఆమెది ఆమె పేరు - దాక్షాయణి వేలాయుధన్ ! ఆ మహనీయురాలికి నివాళి. ఆమె కృషికి సంక్షిప్త పరిచయం ఈ పుస్తకం