
DAKSHINA MADHYA RAILWAY PRAYANAMLO PRASIDDHA PRADESALU - PUNYA KSHETRALU
₹30
In stock · 1 available
PublisherDR.R.ANANTA PADMANABHA RAO
LanguageTelugu
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణంలో ప్రసిద్ధ ప్రదేశాలు- పుణ్యక్షేత్రాలు భారతదేశాన్ని 'యాత్రిక స్వర్గం' గా అభివర్ణిస్తారు. ఎంతో చరిత్ర, పురాతన వైభవం, విభిన్నం, విలక్షణం, వైవిధ్యాలు కలగలసిన భారత భూమి పర్యాటకులకు పసందైన స్వర్గం లాంటిది. భారతీయ సాంప్రదాయంలో పర్యటన అన్నది వినోదాత్మకమే కాదు విజ్ఞానాత్మకం, ఆధ్యాత్మికమూ కలగలసినది. దేశ సమైక్యతకు, సమగ్రతకు పర్యటన ఓ సాధనం. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ భారతదేశం ఒక్కటే అని నిరూపిస్తాయి పర్యటనలు. ఒకప్పుడు ప్రయాణసాధనాలు అంతగా లేని కాలంలో కూడా పర్యాటకులు జట్లుగా ఏర్పడి నెలల తరబడి ప్రయాణం చేసి దేశం నలుమూలలా విస్తరించి ఉన్న పర్యాటక స్థలాలను సందర్శించి తరించేవారు. ఆధునిక కాలంలో, ప్రయాణ సౌకర్యాలు, సాధనాలు అధికంగా ఉన్న కాలంలో పర్యటన మరింత సులువై, సుఖదాయకమయింది. పర్యటనలు, యాత్రలు సులభమూ, సుఖమయమూ, ఆనందకరంగా మలచటంలో భారతీయ రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే స్వర్ణోత్సవ సందర్భంగా ఈ చిన్న పుస్తకాన్ని అందిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రచురణ