DALARI - KATHALU by DR.UPADHYAYULA GOWRISANKARA RAO Telugu book cover

DALARI - KATHALU

by DR.UPADHYAYULA GOWRISANKARA RAO

₹100
In stock · 5 available
PublisherSNEHAKALA SAHITHI PRACHURANA
LanguageTelugu
పల్లవి రామ్మూర్తితో నా పరిచయం రెండు సంవత్సరాలు మాత్రమే. నేను జిల్లేళ్ళమూడి అమ్మగారి కాలేజీలో భాషాప్రవీణ చదువుతున్న రోజుల్లో రామ్మూర్తితో పరిచయం అయింది. అప్పటికి అతను మూడు సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. నాకు బాగా సీనియరు, పైగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లావాడు, నేను విజయనగరం వాడిని, అయినా మా పరిచయానికి అవేమి అడ్డు రాలేదు. ఆ రెండు సంవత్సరాలు నేనూ, రామ్మూర్తి కలిసి మెలిసి తిరిగే వాళ్ళం. మేమిద్దరం ఒకే గదిలో ఉండేవాళ్ళం కావడం వల్ల మా పరిచయం దినదినాభివృద్ది చెందింది. తరవాత రామ్మూర్తి వాళ్ళ వూరు వెళ్ళిపోయాడు. అక్కడే జిల్లా పరిషత్లో తెలుగు టీచరుగా ఉంటున్నాడు. తరవాత మా ఇద్దరి మధ్య ఉత్తరాలే నడుస్తుండేవి. అవికూడా క్రమేపి తగ్గిపోయాయనే చెప్పాలి. నేను జిల్లేళ్ళమూడి వెళ్ళినప్పుడల్లా అనుకునే వాడిని ఏలూరులో దిగి రామ్మూర్తిని చూడాలని, కాని, ఎప్పటికీ కుదిరేది కాదు. కానీ మా బావగారికి ఆ వూరు బదిలీ కావడం, నేను సెలవులకు వెళ్ళడం తటస్థించింది. ఖచ్చితంగా రామ్మూర్తింటికి వెళ్ళాలని పట్టుదలతో దళారి కథలు