DALITHA MEDHAVI DAARI TAPPINAADA ? by SAVVAPPA GARI EERANNA Telugu book cover

DALITHA MEDHAVI DAARI TAPPINAADA ?

by SAVVAPPA GARI EERANNA

₹35
In stock · 1 available
PublisherSAVVAPPA GARI EERANNA
LanguageTelugu
దళిత మేధావి దారి తప్పి నాడా? రంగనాయకమ్మ కుత్సిత రచనకు ఛాలెంజ్ విమర్శ 1. ప్రస్తావన తప్పు లెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల - నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! వేమన "దళిత" సమస్య పరిష్కారానికి, బుద్ధుడు చాలడు! అంబేద్కరూచాడు! మార్క్సు కావాలి! " - రంగనాయకమ్మ అనేపుస్తకమును (366 పేజీలు) వ్రాసి విడుదల చేసింది రంగనాయకమ్మ ధర 50/- పెట్టింది. భారతీయులకు రాజ్యాంగము ప్రకారము వాక్స్వాతంత్ర్యముంది, రచనా హక్కువుంది. అయితే వేమన చెప్పినట్లు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తాను సమాజంలో మెరుగు కావడానికి రంగనాయకమ్మ చేసిన సర్కసు ఫీట్లు అన్నీయిన్నీకావు. అధికారముందని ఎలాగైతే అధికారులు కొందరు అహంతో ఊగిపోదురో అలాగే రంగనాయకమ్మ "నేను రచయిత్రిని" అన్న అవివేకముతో ఊగిపోతు పైపుస్తకమును వ్రాసింది అని పాఠకులు యిట్టే పసిగట్టగలరు. "తాటినెక్కువాడిని తలదన్నే వాడుండునన్న" సామెతను రంగనాయకమ్మ మరచిపోయినట్లుంది." పిచ్చివానిచేతిలో రాయి" అన్నట్టు విచ్చిగీతలుగీసింది రంగనాయకమ్మ ర.నా (రంగనాయకమ్మ) వ్రాసినపుస్తకములో "భారతరత్న" బిరుదాంకితుడు డాక్టరేట్ పట్టా పొందిన మేధావి బహుగ్రంధకర్త దళితుల ఆరాధ్యదైవమైన డా. బి.ఆర్. అంబేద్కర్ గారిని "దారితప్పిన మేధావి", (పేజి 363) అని సిగ్గుశరమువిడనాడి నిర్భయంగా చెప్పడం బట్టి చూస్తే ఆమెలో నున్న కసి-పగ-అసూయ-ద్వేషం మొదలగువాటితో ఎలా రగిలిపోతుందో పాఠకులకు సులభంగానే అర్థమౌతుంది.