
DALITHA PAKSHAM PART 2
₹50
In stock · 5 available
PublisherMALLEPALLI LAXMAIAH
LanguageTelugu
ముందుమాట మనం నివసిస్తున్న సమాజంలో సంభవిస్తున్న పరిణామాల పట్ల స్పందించటం ఒక పౌర ధర్మం. ఈ బాధ్యత విద్యావంతులపై ఎక్కువగా ఉంటుందని ప్రజాస్వామిక వాదులు గుర్తించవలసిన సత్యం. ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండటం కానీ, మౌనం వహించటం కానీ క్షంతవ్యం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడనే ప్రశ్నార్ధకం చేయవచ్చు. బాధిత ప్రజానీకం గళం విప్పినప్పుడు విద్యావంతులు కలం పట్టాలని మాతరం విద్యావంతులకు మార్గదర్శియైన ప్రొ. రావాడ సత్యనారాయణ గారు అనేవారు. వారు ఇప్పటికి దాదాపు నలభై ఏళ్ల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్లఛాన్స్లర్గా పనిచేసేవారు. బాధపడే ప్రజలకు వారి బాధలే తెలుసు; కానీ వారి బాధలకు కారకులెవరో, కారణాలేమిటో, వాటి నివారణోపాయాలేమిటో తెలియవు. వాటి గురించి అధ్యయనం చేసి, విశ్లేషించి, రచనలు చేసి, బాధిత జనావళిని జాగృతపరుస్తూ విద్యావంతులు సమాజంలోని ఇతర వర్గాలకు కూడా అవగాహన కలిగించవలసి ఉంటుంది. ఈ పని ప్రతి కాలంలో ఎంతో కొంత జరుగుతూ ఉన్నప్పటికీ, దాని విస్తృతి జరగవలసిన మేరకు జరగలేదనేది ఒక వాస్తవం. నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి దళితుల వెతలు. ఈ అంశంపై చాలా మంది నిష్ణాతులు అధ్యయనాలు, రచనలు, చేస్తూనే ఉన్నారు. వారిలో నా ఆత్మీయ మిత్రుడు మల్లెపల్లి లక్ష్మయ్య గారిది ఒక విశిష్టమైన స్థానం. వృత్తిరీత్యా లక్ష్మయ్యగారు పాత్రికేయులు; ప్రవృత్తి రీత్యా నిరంతర పరిశోధకులు; నిశితమైన విశ్లేషకులు. తాను అధ్యయనం చేసి అర్ధం చేసుకున్న విషయాలకు, అంశాలకు పదునైన అక్షర రూపం ఇచ్చే ఉత్తమ రచయిత. ఈ సంకలనంలోని వ్యాసాలన్నీ ఒకప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా కొన్నేళ్ళపాటు ప్రచురింపబడినవి. వాటన్నింటినీ ఒకే దగ్గర ముద్రించడం వలన అవి శాశ్వతంగా పాఠకలోకానికి అందుబాటులో వుంటాయి. ఈ వ్యాసాలన్నింటిలో ప్రధానంగా దళితుల పరిస్థితులే మౌలికాంశం అయినప్పటికీ, అనేక ఇతర అనుబంధ, ఆనుషంగిక అంశాలు కూడ చోటుచేసుకున్నవి. ప్రభుత్వ అంగాలైన శాసన నిర్మాణ సభలు, కార్యవర్గాలు, న్యాయవ్యవస్థల పనితీరుతోపాటు వివిధ రాజకీయ పార్టీలు, నాయకుల