
DARPANAM - 100
₹100
In stock · 137 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400965
DARPANAM by Koneru Kalpana ఇవి నేరుగా తెలుగులో రాసిన కథలేమోననిపిస్తాయి. మూల కథల ఆత్మను ఒడిసిపట్టి పాఠకుల మనసుకు హత్తుకునేలా అనువాద రచన సాగింది. ఒక చేయి తిరిగిన రచయిత్రికి వున్న ఒడుపు ప్రవాహశీలత కథల్లో తారసపడతాయి. సృజనశీలి అయిన రచయిత అనువాదం చేస్తే అది ఎంత ప్రభావపూరితంగా వుంటుందో ఈ కథలు చదివితే అర్థమవుతుంది. సునిశిత హాస్యం, పరిపాలనా వ్యవస్థ వ్యంగ్య చిత్రణ, ధర్మనిష్ఠత ప్రతిఫలం, ఆర్ద్రత నిండిన గురుదక్షిణ, స్త్రీ సహజ మాతృత్వపు మాధుర్యం, మానవత్వపు క్రమశిక్షణ, 'మతమా - మానవత్వమా' హృదయాన్ని కరిగించే పరిస్థితులు, వలసజీవుల గుండె చప్పుళ్ళు, తండ్రికోపం ఎండలా చురుక్కుమనిపించినా అంతరంగంలోని చల్లని వెన్నెలప్రేమ మొదలైనవి ఈ దర్పణంలో ప్రతిబింబిస్తాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-96-5