
DASA ROOPAKAALU
₹225
In stock · 83 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మనల్ని మనం చూసుకొని, మేల్కొందాం పదండి - గంగిశెట్టి లక్ష్మీనారాయణ తెలుగు నాటకరంగ చరిత్రలో ఇది విజయభాస్కర్ యుగం. ఇది అభిమానంతో చెప్పే అతిశయోక్తి కాదని, ప్రత్యక్షర సత్యమని విజ్ఞులకు పేరిట ఒక యుగాన్ని చెప్పాలంటే- ఎ) వారు ఆ కాలానికి చెందిన మేజర్ అయివుండాలి, బి) ఒక ట్రెండ్ సెట్టర్ అయి వుండాలి, సి) సమకాలీన మూగాన్ని ప్రభావితం చేసి, దానిపై తన ముద్రను బలంగా వేసి వుండాలి. విజయభాస్కర్ 25. మూడు అంశాలను సంపూర్తిగా సంతృప్తిపరచడమేకాదు, అదనంగా, సమకాలీన కముగాన్ని నిలబెట్టే ఒక సంస్థగా మారాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో నాటక సహజాలకు ప్రదర్శనలకు ఆసరాను అందించే ఒక స్వచ్ఛంద స్నేహసంస్థగా మారాడు. నాటక అనువాద ప్రదర్శనల ద్వారా, తెలుగు నాటకాన్ని ఎల్లలు దాటించి, అఖిల స్థాయిలో ఫోకస్ తెచ్చాడు. ఆయన నాటకాన్ని - తెలుగునాటకాన్ని ఇవ్వాళ ఇంగ్లీషు, బెంగాల్, కన్నడం, తమిళం, మలయాళం వంటి అన్ని ప్రధాన భాషల వాహ చూసి తెలుగు ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ఏదాది క్రితం బెంగుళూరు రవీంద్రకళాక్షేత్రంలో మూడురోజులపాటు విజయభాస్కర్ నాటకాల ప్రదర్శనోత్సవం, కన్నడంలోకి అనువాదం పొందిన నాటకాలతో, విజయవంతంగా జరిగింది. రవీంద్రకళా క్షేత్ర మూడు రోజులూ పోయింది. వచ్చిన వాళ్లలో తెలుగు మాతృభాషీయులు పదిశాతం కూడా లేరు. అందరూ కన్నడ నాటకాభిమానులే. గత ఆరేడేళ్ల నుండి అడపా దడపా విజయభాస్కర్ నాటకానువాదాలను చూసి, ఆయన నాటకాల పట్ల ప్రీతి నేర్పరచుకొన్న కన్నడ ప్రేక్షకులు. 'కన్నడ నాటక రంగం దేశంలోనే ఎంతో ముందంజలో ఉంది కదా! ఈ నాటకాల మీద ఎందుకింత ప్రేమ?' అని అడిగిన దానికి ఓ సహృదయ ప్రేక్షకుడిచ్చిన జవాబు : "మా నాటకాలు ఎంతో గొప్పవే. కాని వాటికి భిన్నంగా, ఇవి ఎంతో 'రిలీఫ్' ఉన్నాయి". నిజమే, వాటిల్లోనూ సెటైర్ ఉంది, సాంప్రదాయిక రీతుల్ని, విశేషించి