
DASARATHI SATHAKAMU
₹70
In stock · 100 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
‘దాశరథీ! కరుణాపయోనిధీ’ తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యం ఒక ప్రధాన పాయ. శతక పద్యాలకు వయోభేదం లేదు. పిల్లలు మొదలు పెద్దలవరకు అందరినీ అలరిస్తాయి. పిల్లలకు నీతులు చెపుతాయి. పెద్దలకు జీవిత సత్యాలను చాటిచెపుతాయి. గడచిన తరాల జీవితానుభవాలను తరతరాలకు గుర్తు చేస్తాయి. లోతుల్లోకి వెళితే జీవన తాత్వికతను బోధిస్తాయి. దేవుని భజిస్తాయి. ఇంకా అనేకం చెపుతాయి. విషయం ఏదయినా తెలుగు భాషా సొబగును పరిచయం చేస్తాయి. సందర్భానికి తగిన తియ్యని పలుకుబడులతో సామెతలతో పెల్లుబికి వస్తాయి. సరిగా వినాలే కానీ వినసొంపైన సంగీతం ధ్వనిస్తుంది. ఇన్ని సుగుణాలు ఉన్నాయి కనుకనే తెలుగు వారినే కాదు తెల్లదొరల్ని సైతం ఇట్టే ఆకట్టుకున్నాయి. మన శతక సాహత్యంలో 'వేమన శతకం', 'సుమతి శతకం', దాశరథీ శతకం'. ముందు వరుసలో ఉంటాయి. 'దాశరథీ శతకం'లో పద్యాలు శ్రీరామచంద్రుని భక్తిలో తాదాత్మ్యం చెందిన భక్త రామదాసు చెప్పినవి. ఆ భక్తుడి అసలు పేరు కంచర్ల గోపన్న. ఈ పద్యాలకు మకుటం 'దాశరథీ! కరుణా పయోనిధీ’. పద్యాలు అన్నీ భక్తి రస ప్రధానాలే. సంస్కృతాంధ్ర పదాల మేలుకలయికతో దాశరథీ శతక పద్యం నడుస్తుంది.