DASAVATARALU - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812195
మత్స్యావతారం యుగాలనాటి మాట. మహా జలప్రళయం సంభవించింది. భూభాగమంతా నీట మునిగింది. ప్రపంచమంతా ఓ పెద్ద సముద్రంలా మారిపోయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడు చేస్తాడు. సకల విజ్ఞానానికి విశ్వ సృష్టికి ఆయనే మూలపురుషుడు. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో | నాలుగు వేదాలను ఒక రాక్షసుడు దొంగిలించాడు. అతడి పేరు హయగ్రీవుడు. క్రూర స్వభావం కలవాడు. ధర్మబద్ధమైన జీవన విధానానికి రాక్షసులు వ్యతిరేకులు. హయగ్రీవుడు తాను దొంగిలించిన నాలుగు వేదాలతో సహా సముద్రం అడుగు భాగాన దాగి ఉన్నాడు. ఆ కాలంలో సత్యవ్రతుడనే ఋషి వుండేవాడు. ఒకనాడు ఉదయం వేళ సత్యవ్రతుడు సంధ్యావందనంలో నిమగ్నమై ఉన్నాడు. కాలకృత్యాలు పూర్తి చేసుకుని సూర్యభగవానునికి దోసిలితో నీళ్ళు భక్తితో సమర్పిస్తున్నాడు. అంతలో ఓ చిన్న చేప నీటిలో నుంచి ఎగిరి ఆయన దోసిలిలో పడింది. సత్యవ్రతుడు వెంటనే దానిని నీటిలోనికి వదిలి వేశాడు. అప్పుడు ఆ చిన్న చేప ఋషికి ఇలా మొరపెట్టుకుంది. “ఓ దయామయుడా ! ఈ నీటిలో...... పిల్లల బొమ్మల దశావతారాలు మత్స్యావతారం