
DATLA DEVADANAM RAJU KATHALU
₹50
In stock · 2 available
PublisherDATLA DEVADANAM RAJU
LanguageTelugu
కవులు కథలు రాస్తే ఓ ప్రమాదం జరుగుతుంటుంది. కథల్లో కూడా తమ కవిత్వాన్ని అవసరమున్నా లేకపోయినా గుప్పించాలని ప్రయత్నిస్తారు. కవిత్వానికీ కథలకూ ఉండే ప్రక్రియావ్యత్యాసాన్ని మరచిపోయి కథ కవితలుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. దాట్ల దేవదానం రాజు కథల్లో అలాంటి పొరబాటు జరగలేదు. కవిత్వం కల్గిన కథల్ని రాయాలన్న మోజు ఆయన కథల్లో కనిపించలేదు. కధానికా శిల్పంలోని మెలకువల్ని ఆయన ఆకళింపు చేసుకున్నాడు. దేవదానం రాజు కథల్లో ఎక్కువగా ఆయన నివసిస్తున్న యానాం ప్రాంతపు వాతావరణం అక్కడి అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలు చిత్రితమయ్యాయి. మొత్తమ్మీద దాట్ల దేవదానం రాజు రాసిన ఈ కథలన్నింట్లోనూ ఓ మంచి పాయింట్ ఉంది. తీసుకున్న కథాంశాన్ని కథగా మలచిన తీరు హృద్యంగా ఉంది. కథలన్నింట్లోనూ వాస్తవికత ఉట్టిపడింది. వీటితోబాటు ఈ కథల్లో మంచి పఠనీయతా గుణం కూడా ఉంది. ఇన్నిమంచి కథలు రాసిన దేవదానం రాజును అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ రచయిత ఇంకెన్నో మంచి కథలు రాస్తాడని ఆశిస్తున్నాను.