DEEPAM - SAMKALANAM by NIMMAGADDA JANARDHANARAO Telugu book cover

DEEPAM - SAMKALANAM

by NIMMAGADDA JANARDHANARAO

₹100
In stock · 52 available
PublisherNIMMAGADDA JANARDHANARAO
LanguageTelugu
ముందుమాట క్రీ.పూ. 7500 నాటికి మంచు యుగం తొలగిపోయింది. మనదేశంలో కైబరు కనుమ దిగువున మెహర్ ఘడీ సమీపంలో స్వాత్, శోభ నదీ తీరాలలో అప్పటి ప్రజలు స్థిర నివాసమేర్పరచుకొని పశుపాలనతో నవీన శిలాయుగంలోనికి అడుగుపెట్టారు. కాలక్రమేణా ఊట చెలమలు ఎండిపోవటం, ఉష్ణోగ్రతలలో మార్పులు, తమకు ఆహారం అందకపోవటంతో క్రీ.పూ. 4500 ప్రాంతంలో వలసలు సాగి సింధు - సరస్వతీ నదుల మధ్య ఆవాసములను నెలకొల్పుకొని పశుసంపదను వృద్ధి జేసికొనజొచ్చిరి. ప్రకృతిని గమనించుచూ పోడు వ్యవసాయము నుండి, పంటపొలములు పెంచి వ్యవసాయ ఉత్పత్తులను పెంచసాగిరి. కాంశ్య యుగములో ప్రవేశించిరి. క్రీ.పూ. 4000 పిమ్మట పర్షియా, మెసపొటోమియా ప్రజలతో వాణిజ్యం పెరిగింది. మెసపొటోమియాలోని అసీరియనులు, అకాడియనులు, ఈలం ప్రాంత ప్రజలు సరస్వతీ మైదానములకు వచ్చి స్థానికులతో కలసిపోయారు. పర్షియా పీఠభూమి అటు మెసపొటోమియా నుండి హిందూ దేశము వరకు విస్తరించియున్నది. పర్షియా సుమేరియనులు వర్తక వ్యాపారములలో అనుభవము గడించి మన వస్తువులను చౌకగా కొనుటచే యిచటివారికి గిట్టుబాటు లేక ప్రజలలో ఆందోళన హెచ్చినది. సుమేరియనులు తాము యింద్రులమని అసేరియా, అకాడియాలు ఉన్న పురములను తగులబెట్టిరి. పైగా వీరిని అసురులుగా ప్రకటించిరి. కాని వీరు ద్రవిడులవలె ప్రకృతికి ప్రణమిల్లటం, పంట పండిన తదుపరి పంట సిరికి నైవేద్యం పెట్టటం మొదలగునవి చేసేవారు. అప్పటివారికి జీవహింస తెలియదు. క్రీ.పూ. 3200 నాటికి పర్షియా యందలి బహమన్ నందు నివశించు హిటైట్లు, సిరియనులు, రూసీలు, ఆరామియా గుంపుల భాషల కలయికతో ఒక కొత్త భాష ఉద్భవించింది. అదే సంస్కృతము. ఆ భాష నేర్పిన వారే బ్రహ్మలు, ప్రజాపతులు.