
DEEPIKA
₹200
In stock · 5 available
PublisherDR.GUMMA SAMBHASIVARAO
LanguageTelugu
ఒక మంచి అవకాశం విహారి గారు తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. జీవిత బీమా సంస్థలో ఉన్నతోద్యోగం చేసి విశ్రాంత జీవనాన్ని అవిశ్రాంత సాహిత్య రచనలతో సాగిస్తున్న భాగ్యశాలి. ప్రశాంత వదనం, మృదు భాషణం అందరినీ ఆకట్టుకోవటానికి ఆయనకున్న ప్రముఖ లక్షణాలు. వీరు ఏ ప్రక్రియలోనైనా రచన చెయ్యగల సమర్థులు. కథారచయితగా బాగా ప్రసిద్ధి పొందిన విహారిగారు “శ్రీ పదచిత్ర రామాయణము" రచనతో ఉత్తమ పద్య కవిగా సాక్షాత్కరించారు. వారు రచించిన శ్రీ పదచిత్ర రామాయణంలోని బాలకాండను గూర్చి హైదరాబాదు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో మాట్లాడాను. ఆ తర్వాత ఇటీవల విహారిగారు రచించిన శ్రీ పదచిత్ర రామాయణానికి సంబంధించిన ప్రత్యేక సంచికను అ.జో. వి. భొ. కందాళం ఫౌండేషన్ వారు ప్రచురిస్తూ “శ్రీ పదచిత్ర రామాయణంలోని వర్ణనలు' అనే అంశం మీద నేను రచించిన వ్యాసాన్ని కూడా ప్రచురించటం నాకు సంతోషాన్ని కలిగించింది. విహారిగారికి అ.జో. వి. భొ. కందాళం ఫౌండేషన్ వారు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేసిన సందర్భంగా జరిపిన సాహితీ సదస్సులో నేను "శ్రీ పదచిత్ర రామాయణము-సామాజికత" అనే అంశాన్ని గూర్చి ఉపన్యసించాను. ఆనాటి నుండి ఆ అంశాన్ని విశ్లేషించి రాయాలనే భావంతో ఉన్నానని విహారిగారికి చెబితే "అయితే ఆలస్యం ఎందుకు ప్రారంభించండి" అని ప్రోత్సహించారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థతుల దృష్ట్యా ఇల్లు వదలి ఎక్కిడికీ వెళ్లకూడని పరిస్థితి ఏర్పడటంతో విహారిగారి శ్రీ పదచిత్ర రామాయణాన్ని మరోసారి చదివాను. ఆరువేల పద్యాలకు పైగా ఉన్న ఈ రామాయణం విహారిగారి బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. విహారిగారు రామాయణ రచనలో ఉపయోగించిన ఛందస్సులు గానీ, చేసిన వర్ణనలు గానీ, ప్రయోగించిన అలంకారాలు కానీ, పాఠకునికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కవికి భావుకశక్తితోపాటు లోకజ్ఞత కూడా ఉంటే ఉత్తమశ్రేణి కవిత్వం ఆవిర్భవిస్తుందని డా. గుమ్మా సాంబశివరావు