DEEPIKA - ABHYUDAYA SAHITYA VYASA SAMPUTI by PENUGONDA LAKSHMINARAYANA Telugu book cover

DEEPIKA - ABHYUDAYA SAHITYA VYASA SAMPUTI

by PENUGONDA LAKSHMINARAYANA

₹200
In stock · 354 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1953లో ఏర్పాటైన మా విశాలాంధ్ర ప్రచురణాలయం తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో అగ్రగామి. వేలాదిగా అభ్యుదయ సాహిత్య గ్రంథాలను ప్రచురించి తెలుగునాట ప్రతి ఇంటికీ, గ్రంథాలయాలకూ చేరువైన సంస్థ. ఏడు దశాబ్దాలకు పైగా ఆదర్శవంతమైన కృషిని కొనసాగిస్తున్న మా సంస్థ ప్రచురణలు ఎనలేని ఖ్యాతిని ఆర్జించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, విశ్వవిద్యాలయాల పురస్కారాలు మరెన్నెన్నో గౌరవాలను మా ప్రచురణలు అందుకున్నాయి. ఇది మాకెంతో గర్వకారణం. ఇవి మా సంస్థ కీర్తిప్రతిష్టలను తెలుపుతున్నాయి. మేము ప్రచురించిన పెనుగొండ లక్ష్మీనారాయణ 'దీపిక' (అభ్యుదయ వ్యాస సంపుటి)కి 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మాకెంతో సంతోషం కలిగించింది. అభ్యుదయ రచయితల సంఘంలో, అభ్యుదయ సాహిత్యోద్యమంలో అర్ధశతాబ్దికి పైగా అవిశ్రాంత కృషిని కొనసాగిస్తున్న పెనుగొండకు శుభాకాంక్షలను మా సంస్థ అందిస్తోంది. జూన్ 2021లో ప్రచురితమైన ఈ పుస్తకం అవసరం మళ్ళీ ఏర్పడింది. అందుకే ఈ పునర్ముద్రణ. అందుకోండి. అభ్యుదయ సాహిత్యాన్ని ఆదరించండి...