
DESA DESALA KAPPALA KATHALU (BOMMALATHO)
₹20
In stock · 120 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నూతిలో కప్ప నూతిలో ఉండే కప్ప ఒకమారు, సముద్రంలో ఉండే తాబేలుతో గొప్పలు పోయింది. నేను చాలా చాలా ఆనందంగా ఉన్నానని అరిచింది. నేను బయటకు పోవాలంటే నూతి గట్టు మీదకు గెంతుతాను. ఇంటి కొచ్చాక నూతి గోడల కన్నాల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నేను నీటిలోకి గెంతుతే, నీరు నా చంకలవరకూ వస్తుంది కాబట్టి నేను హాయిగా నీటిమీద నా కడుపునానించి తేలుతుంటాను. నేను బురదలో నడుస్తే, నా కాళ్లు మునుగుతాయి. నా చుట్టూ నాకు కావల్సినంత తిండి దొరుకుతుంది. నా కంటే గొప్ప వాళ్లు ఇక్కడ లేరు. నా ఆనందానికి అంతులేదిక్కడ అంది. ఇక్కడికి వచ్చి నన్నూ నా ఈ ప్రాంతాన్నీ చూడొచ్చు కదా అంది. తాబేలు తన ఎడమ కాలు నూతిలో పెట్టబోతుంటే దాని కుడి మోకాలు చిక్కుకుంది. సంకోచిస్తూనే సముద్రం విషయం తాబేలు కప్పతో అంది. వేయి మైళ్ల దూరం కూడా దాని వెడల్పు చెప్ప లేదు. వేల అడుగుల దూరం కూడా దాని లోతుని చెప్పలేదు. పెద్ద పెద్ద వరదల్లో కూడా సముద్ర నీటిమట్టం పెరగదు. అతి పెద్ద కరువులో కూడా నీటిమట్టం తరగదు. సమయంతో బాటు వర్షాలతో బాటు, సముద్రం తరగదు, పెరగదు. అంచేత ఎక్కువ ఆనందం సముద్రంలో ఉండటంలోనే ఉందంది. తాబేలు. అంతా విన్నాక నూతిలో ఉండటంలోని లోటుపాట్లేవో కప్పకు తెలిసి నిర్ఘాంత పోయింది. బయట ఇంకా గొప్ప ప్రదేశాలున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయి గొప్పలు తగ్గించుకుంది. 3