DESAM LO GOWRAVANEEYULAINA MURKHULU by DR.DEVARAJU MAHARAJU Telugu book cover

DESAM LO GOWRAVANEEYULAINA MURKHULU

by DR.DEVARAJU MAHARAJU

₹130
In stock · 379 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
భూమి ఆరువేల సంవత్సరాల నుండి ఉందన్న మతపరమైన వాదనకు, భూగర్భశాస్త్ర ప్రకారం బిలియన్ సంవత్సరాల నుండి ఉందన్న వాదనకూ పొసగదు. మత విశ్వాసకుల దేవుడు - మనుషుల్ని ఉన్నది ఉన్నట్లుగా పుట్టించి, వారి జాతకాల మీద, వారి దైనందిన జీవితం మీద అజమాయిషీ చేస్తున్నాడు. కానీ, జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి ఇతర జంతు జాతుల నుండి అభివృద్ధి చెందుతూ మానవుడిగా రూపాంతరం చెందాడు - అనేది వాస్తవం! చేసిన పాపాల వల్ల, భూతాల వల్ల, దయ్యాల వల్ల మనుషులకు రోగాలు వస్తున్నాయని మత విశ్వాసకులు నమ్ముతారు. వీటన్నిటినీ కొట్టిపారేసి, సూక్ష్మక్రిముల వల్ల గానీ, లోపాలున్న వారసత్వ లక్షణాల వల్లగానీ జబ్బులు వస్తాయన్నది జీవశాస్త్రం చెపుతూ వుంది. కవిగా, సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ ఎనభై అయిదుకి పైగా పుస్తకాలు ప్రకటించిన డాక్టర్ దేవరాజు మహారాజు, ఒక జీవశాస్త్రవేత్తగా సమాజంలో వైజ్ఞానిక స్పృహను, మా'నవ' వాదాన్ని సామాన్యులకు అందించే దిశలో చాలా చురుకుగా పని చేస్తున్నారు. నేటి దేశ కాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని రాసిన ఈ విశ్లేషణలు జనచైతన్యానికి తప్పక దోహదం చేస్తాయి. లోగడ విశాలాంధ్ర ప్రచురించిన 'నేను' అంటే ఎవరు?- అనే వీరి పుస్తకానికి 2021- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దేశంలో గౌరవనీయులైన మూర్ఖులు శీర్షికన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఈ గ్రంథాన్ని పాఠకులకు సగర్వంగా అందిస్తోంది. జననాడిని, జీవనాడిని పట్టుకోవడంలో ఈ ప్రచురణ సంస్థ ఎప్పుడూ ముందే ఉంటూ వస్తోంది!