
DEVALAYALA MEEDA BUTHU BOMMALENDUKU - 70
₹70
In stock · 1 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పీఠిక మూడవ ముద్రణ : తరచుగా చూస్తూనే ఉన్నాము - ప్రత్యక్షంగా కాకపోయినా, పత్రికలలోనైనా - చూస్తూనే వున్నాము. ఒకచోట కాలువ త్రవ్వుతుంటే కొన్ని శిథిలాలు కనబడ్డాయనీ, ఇంకెక్కడో భూగర్భంలో కొన్ని పురాతన కాలపు అవశేషాలు కనపడ్డాయనీ, చూస్తూనే వున్నాము. గత మాసం రష్యా మధ్యప్రదేశంలో తవ్వుతూ ఉంటే బౌద్ధస్థూపం శిథిలాలూ, కొన్ని శిల్పాల ముక్కలూ కనిపించాయి. 15 రోజులకు పూర్వం పూనా సమీపంలో 5000, 6000 సంవత్సరాలనాటి పురాతన అవశేషాలు దొరికాయి. ఈలాంటి పురాతన వస్తు పరిశోధనలలో ఆరితేరిన మహా మేధావులు వాటిని అధ్యయనం చేసి, అవి ఏకాలానివో, ఏ జాతి (తెగ) వారికి సంబంధించినవో, ఆ జాతివారి సంస్కృతి ఏలాటిదో... అంతా ప్రకటిస్తారు. అలాంటి మేధావుల మూలంగానే మనకు మొహంజదారో, హరప్పా, నాగార్జునకొండ మొదలైన పురాతన విశేషాలు లభించాయి. అద్భుతమైన దీక్షా మేధాశక్తికల పాశ్యాత్య పరిశోధకులు నూరు, మాటయాభై సంవత్సరాలకు పూర్వమే తూర్పుదేశాల పురాతన విశేషాలు పరిశోధన చేసి అనేక గ్రంథాలు ప్రచురించారు. వారి పరిశ్రమల ఫలితంగానే ఫినీషియా, క్రీట్, మయ, మెసపటోమియా, ఖాల్డియా, బాబిలోనియా మొదలైన ప్రాచీన (అనగా కొన్నివేల సంవత్సరాలనాటి) జాతుల వారి నాగరికత (సంస్కృతి) గురించి మనకు ఈపాటి అయినా తెలిసింది. ఆయా ప్రాచీన సంస్కృతులు చాలావాటిలో గూడ స్త్రీల స్వామ్యమూ, సంభోగ స్వేచ్ఛా, దేవతారాధనకు సంభోగమే ముఖ్యసాధన అన్న అభిప్రాయమూ - ఇవి స్ఫుటంగా కనిపిస్తాయి. దేవాలయాలు ఆ విధంగా క్రీడా మందిరాలుగా ఉండేవని లిఖిత పూర్వకమైన లెక్కలున్నాయి. సంభోగము