
DEVARAKOTESHU HORU
by TALLAVAJJALA PATANJALI SASTRY
₹90
In stock · 19 available
PublisherTALLAVAJJALA PATANJALI SASTRY
LanguageTelugu
దేవర కోటేశు జ్వరం కంట్లో సూర్యాస్తమయం. ఎర్రటి కంటి వేసవి! సంధ్యవేళ అప్పుడే నిప్పులు తీసిన కుంపటి. ఎండల్లో మెట్ట గ్రామం గింగిరాలు తిరుగుతోంది. తార్రోడ్డు నల్ల లావా దారం బొంగరం జాలీ.... జ్వర దేహం. కిటికీ అవతల ఇవతల చీకటి పడుతోంది. జ్వరం కన్నులా సూర్యుడు. నల్లటి కన్రెప్ప మూసుకుంది. ఒళ్లంతా వేడి. సూర్యుడి కెమోథెరపీ తరువాత నేల ఒంటి మీద ఒక్క పచ్చ వెంట్రుక లేదు. ఆవులించాడు. వేడిగాలి బొడ్లోంచి వచ్చినట్టుగా నల్లటి నోరులా ఎండిన బావుల్లా నోరులాంటి బావులు... మొక్కల నరాలు నేల కింద కుళ్లిపోయాయి. ఎర్రబల్బు కూడా గాయంలా ఉంది. ఒళ్లే పుండయిపోయింది. పుండులాంటి బల్బు. ఆఖరి ఎరుపు నలుపులో కలుస్తోంది. కుంకుమ కొండ బద్దలై విరజిమ్మిన అరుణిమ లేతనలుపులో కరుగుతూంటే రావి చెట్టు మూలిగింది. బల్బు ఒక మూల చీకటి ఎర్ర కన్ను, చీకటి గ్రామంలో కళ్లు విచ్చుకున్నాయి. కాసేపటికి మెల్లిగా తెరుచుకున్న జ్వరం కంట్లో ఎర్రబల్బు అలాగే నిశ్చలంగా ఉండి పోయింది. కొన్నేళ్లక్రితం మాట ఇది.